SGB Redemption: గోల్డ్ బాండ్ కొన్నారా? సొమ్ములొచ్చే సమయం వచ్చేసింది.. సిద్ధం కండి..

డబ్బులను పొదుపు చేసుకోవడానికి, భవిష్యత్తులో అధిక రాబడి పొందటానికి అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతుంటారు. దీర్ఘకాలంలో వాటి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) కూడా మంచి రాబడి అందిస్తాయి. ఈ నేపథ్యంలో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన 2016 -17 సిరీస్ Iకు సంబంధించిన బాండ్లను ఆగస్టులో రీడిమ్ చేసుకోవచ్చు. బంగారంపై […]

SGB Redemption: గోల్డ్ బాండ్ కొన్నారా? సొమ్ములొచ్చే సమయం వచ్చేసింది.. సిద్ధం కండి..
Money
Follow us

|

Updated on: Jul 20, 2024 | 6:54 PM

డబ్బులను పొదుపు చేసుకోవడానికి, భవిష్యత్తులో అధిక రాబడి పొందటానికి అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతుంటారు. దీర్ఘకాలంలో వాటి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) కూడా మంచి రాబడి అందిస్తాయి. ఈ నేపథ్యంలో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన 2016 -17 సిరీస్ Iకు సంబంధించిన బాండ్లను ఆగస్టులో రీడిమ్ చేసుకోవచ్చు.

బంగారంపై పెట్టుబడి..

బంగారం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. దానిలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఇది అత్యంత తెలివైన నిర్ణయం కూడా. సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే భౌతిక బంగారం పెట్టుబడికి అనువైన ప్రత్యామ్నాయం. వీటిని ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ బాండ్లను కొనుగోలు చేసి, నిర్ణీత సమయంలో విక్రయించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు.

సావరిన్ బాండ్లు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్ల జారీకి నోటీసు, అలాగే విముక్తి (రీడిమ్) తేదీలను విడుదల చేస్తుంది. సాధారణంగా ఎస్జీబీ కాలవ్యవధి ఎనిమిదేళ్లు (మెచ్యూరిటీ రీడిమ్) ఉంటుంది. అయితే జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత రీడిమ్ (అకాల రీడిమ్) చేయవచ్చు. అంటే ఈ విధానంలో మీరు బాండ్లను కొనుగోలు చేస్తారు, కాల వ్యవధి అనంతరం విక్రయిస్తారు. క్రయ విక్రయాలకు సంబంధించిన నగదు మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే మీవద్ద భౌతికంగా బంగారం ఉండదు. కేవలం బాండ్ల రూపంలోనే ఉంచుకుంటారు.

రీడిమ్ నిబంధనలు..

  • సావరిన్ గోల్డ్ బాండ్ల రీడిమ్ వ్యవధి ఎనిమిదేళ్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన 2016 -17 సిరీస్ Iకు సంబంధించిన బాండ్లను ఆగస్టులో రీడిమ్ చేసుకోవచ్చు.
  • సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2016-17 సిరీస్ I బాండ్ల దరఖాస్తులను 2016 జూలై 18 నుంచి 22 మధ్య ఆమోదించారు. అదే ఏడాది ఆగస్టు 5 బాండ్లను జారీ చేశారు. ఈ సిరీస్ ఇష్యూ ధరను రూ. 3,119గా నిర్ణయించారు. వీటిని 2024 ఆగస్టు మొదటి వారంలో రీడిమ్ (విక్రయం) చేసుకోవచ్చు.
  • ఎస్జీబీల ప్రారంభ పెట్టుబడిపై 2.75 శాతం (స్థిరమైన రేటు) వార్షిక వడ్డీ రేటు ఉంటుంది. సెమీ-వార్షిక వాయిదాలలో చెల్లిస్తారు.

కొనుగోలు చేసే విధానం..

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు ప్రక్రియను తెలుసుకుందాం. దాని కోసం ఈ పద్ధతులు పాటించాలి.
  • ముందుగా ఎస్ బీఐ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి. ప్రధాన మెనూలోకి వెళ్లి ఇ-సేవ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనే ట్యాబ్‌ను ఎంచుకోండి.
  • మీరు మొదటి సారి పెట్టుబడి పెడుతున్నట్టయితే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. హెడర్ ట్యాబ్ నుంచి రిజిస్టర్ ను ఎంచుకుని, ఆపై నిబంధనలు, షరతులను అంగీకరించి, చివరగా ‘కంటిన్యూ’ అనే దానిపై క్లిక్ చేయాలి.
  • దానిలో అడిగిన సమాచారాన్ని పూరించాలి. మీ డీమ్యాట్ ఖాతా నిల్వ చేసిన ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ నుంచి డిపాజిటరీ పార్టిసిపెంట్‌ను ఎంచుకోండి.
  • డీపీ ఐడీ, క్లయింట్ ఐడీలో కీ చేసి, సబ్మిట్ అనే ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  • సమాచారాన్ని నిర్ధారించి, సబ్మిట్ అనే ఎంపికపై క్లిక్ చేయండి.

ఫైనల్ రీడిమ్ ధర నిర్ణయించే విధానం..

ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) నివేదిక ప్రకారం.. మునుపటి వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా లెక్కిస్తారు. ఇది రూపాయలలో ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారం దీన్ని నిర్ణయిస్తారు. బంగారు బాండ్ల జారీ ధర వాటి నామమాత్రపు విలువ కంటే గ్రాముకు రూ.50 తక్కువగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?