Fixed Deposit: ఐసీఐసీఐ బ్యాంకులో పెరిగిన ఎఫ్‌డీ రేట్లు.. కొత్త రేట్లు ఇవే..

మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2024, జూలై 16 నుంచి అమలులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే ఎఫ్డీలు, అలాగే రెన్యూవల్ చేసుకునే ఎఫ్డీలు రెండింటికీ ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.

Fixed Deposit: ఐసీఐసీఐ బ్యాంకులో పెరిగిన ఎఫ్‌డీ రేట్లు.. కొత్త రేట్లు ఇవే..
Icici Bank
Follow us

|

Updated on: Jul 20, 2024 | 5:47 PM

ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అన్ని బ్యాంకులు సవరిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2024, జూలై 16 నుంచి అమలులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే ఎఫ్డీలు, అలాగే రెన్యూవల్ చేసుకునే ఎఫ్డీలు రెండింటికీ ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. సవరించిన రేట్ల ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సంవత్సరానికి కనీసం 3.00% నుంచి గరిష్టంగా 7.20% వరకు వడ్డీని ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాం..

ఐసీఐసీఐ బ్యాంక్ తాజా ఎఫ్డీ రేట్లు..

బ్యాంక్ ఇప్పుడు 7 నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితిపై 3.00% వడ్డీ రేటు, 30 నుంచి 45 రోజుల మధ్య ఉండే వాటిపై 3.50% వడ్డీ రేటును ఇస్తోంది. 46 నుంచి 60 రోజుల వ్యవధికి 4.25% వడ్డీ రేటు ఇస్తుంది. 61 నుంచి 90 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 4.50% వడ్డీ రేటు వర్తిస్తుంది. 91 నుంచి 184 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పుడు 4.75% వడ్డీ రేటును అందిస్తాయి. అయితే 185 నుంచి 270 రోజులలో మెచ్యూర్ డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటును అందిస్తాయి.

అలాగే 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70% వడ్డీ రేటును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తుంది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే వాటిపై 6.00% వడ్డీ రేటును కూడా చెల్లిస్తుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలపై గరిష్ట వడ్డీ రేటు 7.20% అందిస్తోంది. బ్యాంక్ 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 5 సంవత్సరాల వరకు 7.00% రాబడిని అందిస్తుంది. ఐదు సంవత్సరాలలో ఒక రోజు నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఇప్పుడు 7.00% ఉంటుంది.

డెవిడెండ్ విడుదల..

ఏప్రిల్ 27, 2024న జరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ. 10 తుది డివిడెండ్‌ను అందించేందుకు సిఫార్సు చేసినట్లు బ్యాంక్ ప్రకటించింది. బోర్డు సిఫార్సు చేసిన ఈ డివిడెండ్, ఆగస్టు 29, 2024న జరగనున్న30వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమోదం పొందితే అది వాటాదారులకు చెల్లిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐసీఐసీఐ బ్యాంకులో పెరిగిన ఎఫ్‌డీ రేట్లు.. కొత్త రేట్లు ఇవే..
ఐసీఐసీఐ బ్యాంకులో పెరిగిన ఎఫ్‌డీ రేట్లు.. కొత్త రేట్లు ఇవే..
అసలీ నోట్లను మించిన నకిలీ నోట్లు.. ఫేక్ కరెన్సీ గుట్టురట్టు..
అసలీ నోట్లను మించిన నకిలీ నోట్లు.. ఫేక్ కరెన్సీ గుట్టురట్టు..
విక్రమార్కుడు రీరిలీజ్.. ఎప్పుడంటే..
విక్రమార్కుడు రీరిలీజ్.. ఎప్పుడంటే..
మీ యవ్వన రహస్యం ఇదేనట..! రెండు రోజుల తేడాతో మీ ఆయుష్షు మూడినట్టే!
మీ యవ్వన రహస్యం ఇదేనట..! రెండు రోజుల తేడాతో మీ ఆయుష్షు మూడినట్టే!
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
గతంలోనూ చాలా సార్లు సర్వడౌన్స్‌.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..
గతంలోనూ చాలా సార్లు సర్వడౌన్స్‌.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..
ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర తెలిస్తే..
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర తెలిస్తే..
అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే
అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే
ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?