19 July 2024
TV9 Telugu
యూజర్లను మరింత అట్రాక్ట్ చేసే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో ఆసక్తికరమైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
రూ. 139తో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతీ రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 197 ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు.
రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. డేటా ఎక్కువగా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్.
ఏడాది ప్లాన్ కోసం చూస్తున్న వారికి బీఎస్‌ఎన్‌ఎల్ మంచి ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 2399తో రీఛార్జ్ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. వీటితో పాటు దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజూ 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు.
ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను అందిస్తుండగా, మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ.