ITR filing: గడువు పొడిగించాల్సిందేనా? ముందుకు సాగని ఐటీఆర్ ఫైలింగ్‌.. కారణమిదే..

పోర్టల్ సరిగ్గా పనిచేయడం పోవడంతో ఐటీఆర్ ఫైలింగ్ ఇబ్బందులు కలుగుతున్నాయని ఆదాయపు పన్ను బార్ అసోసియేషన్ (ఐటీబీఏ) తెలిపింది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఐటీఆర్ సమర్పించడానికి చెల్లింపుదారులు సిద్ధంగా ఉన్నా పోర్టల్ వల్ల ఆలస్యం జరుగుతోందని వివరించింది. ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25 కోసం ఇప్పటివరకు 3.42 కోట్ల ఐటీఆర్ లు ఫైల్ అయ్యాయని, ఇంకా చాలామంది అందజేయాల్సి ఉందని తెలిపింది.

ITR filing: గడువు పొడిగించాల్సిందేనా? ముందుకు సాగని ఐటీఆర్ ఫైలింగ్‌.. కారణమిదే..
Itr Filing
Follow us

|

Updated on: Jul 20, 2024 | 7:22 PM

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే గడువు ఉంది. దీంతో పన్ను చెల్లింపుదారులందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఐటీఆర్ కు అవసరమమైన రశీదులు, పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పోర్టల్ లో ఇబ్బందులు కారణంగా ఐటీఆర్ సమర్పించడం కుదరడం లేదు. ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరం(2024-25) కోసం ఇప్పటివరకు 3.42 కోట్ల ఐటీఆర్ లు మాత్రమే ఫైల్ చేశారు. గతేడాది జూలై 31 నాటికి రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఐటీఆర్ లు అందాయి.

వెంటాడుతున్న పోర్టల్ సమస్యలు..

పోర్టల్ సరిగ్గా పనిచేయడం పోవడంతో ఐటీఆర్ ఫైలింగ్ ఇబ్బందులు కలుగుతున్నాయని ఆదాయపు పన్ను బార్ అసోసియేషన్ (ఐటీబీఏ) తెలిపింది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఐటీఆర్ సమర్పించడానికి చెల్లింపుదారులు సిద్ధంగా ఉన్నా పోర్టల్ వల్ల ఆలస్యం జరుగుతోందని వివరించింది. ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25 కోసం ఇప్పటివరకు 3.42 కోట్ల ఐటీఆర్ లు ఫైల్ అయ్యాయని, ఇంకా చాలామంది అందజేయాల్సి ఉందని తెలిపింది. గడువు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆగస్టు 31 వరకూ పెంచాలని వివరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

సమస్య ఇదే..

ప్రభుత్వానికి రాసిన లేఖలో ఐటీబీఏ అనేక విషయాలను ప్రస్తావించింది. సమస్య తెలిపుతూ, దానికి పరిష్కరానికి మార్గాలనూ సూచించింది. ఆ ప్రకారం..

  • ఆదాయపు పన్ను పోర్టల్ దాదాపు నెల రోజులుగా సరిగ్గా పనిచేయడం లేదు. చాలా నెమ్మదిగా పనిచేయడం, అప్‌లోడ్ సమస్యలు ఉన్నాయి. ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ కోసం యూఐడీఏఐ నుంచి ప్రతిస్పందన లేదు.
  • పెరుగుతున్న పన్నుచెల్లింపుదారులకు అనుగుణంగా పోర్టల్ ను సజావుగా పనిచేసేలా చూడాలి. దానికి అవసరమైన సాంకేతిక బృందం, అధికారులను నియమించాలి.
  • ఏవై 2024-25కు సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకూ పొడిగించాలి.
  • గతేడాది ఈ సమయంలో పోర్టల్ చక్కగా పనిచేసింది. కానీ ఈ ఏడాది ఇబ్బందులు తలెత్తాయి.
  • ఐటీఆర్ సమర్పించడానికి జూలై 31 వరకూ మాత్రమే గడువు ఉండడంతో పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. పోర్టల్ సమస్యల కారణంగా ఈ ఇబ్బంది తలెత్తింది.
  • ఏవై 2023-24కి సంబంధించి 2023 జూలై 31 నాటికి రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఐటీఆర్ లు అందాయి. అనంతరం 2023 డిసెంబర్ 31 నాటికి అవి 8.18 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం ఏవై 2024-25కు సంబంధించి ఇప్పటి వరకూ 3.42 కోట్లు మాత్రమే ఫైలింగ్ అయ్యాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఎంపీలతో కీలక చర్చ
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
కేంద్ర మంత్రులు, ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఈ అంశాలపై చర్చ
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
సింపుల్‌గా బగారా బైంగన్ తయారీ.. టేస్ట్ మామూలుగా ఉండదు..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు కారణాలు.. జాగ్రత్త పడండి..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?
జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?