Sim Card: భద్రం.! బీ కేర్‌ఫుల్ బ్రదరూ.. ఈ తప్పులు చేస్తే మీ సిమ్ కార్డే మిమ్మల్ని జైలుకు పంపుతుంది..

|

Dec 14, 2022 | 12:56 PM

మీరు రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారా.? అయితే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.!

Sim Card: భద్రం.! బీ కేర్‌ఫుల్ బ్రదరూ.. ఈ తప్పులు చేస్తే మీ సిమ్ కార్డే మిమ్మల్ని జైలుకు పంపుతుంది..
Simcard Fraud
Follow us on

మీరు రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారా.? అయితే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.! ఇవి మర్చిపోతే మీ సిమ్ కార్డే మిమ్మల్ని జైలుకు పంపిస్తుంది.. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటిగా మీరు గుర్తించుకోవాల్సిన విషయమేంటంటే.. మీ సిమ్‌ కార్డును ఇతరుల చేతుల్లోకి పడనివ్వకుండా జాగ్రత్త పడాలి.. ఒకవేళ అదే జరిగితే సిమ్ కార్డు దిర్వినియోగం కావడం పక్కా. వాళ్లు ఆ సిమ్ కార్డు ద్వారా మోసాలకు కూడా పాల్పడవచ్చు. మీ మొబైల్ నెంబర్‌తో ఏదైనా మోసం జరిగితే.. మీరు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇదిలా ఉంటే.. మరికొందరు తమ ఫోన్‌లో సిమ్ కార్డు పని చేయట్లేదని.. వేరొకరి మొబైల్‌లో పెడుతుంటారు. తద్వారా ఆ వ్యక్తులు మీ సిమ్‌కు డూప్లికేట్ లేదా క్లోన్‌ తయారు చేసి దానితో తప్పుడు పనులకు వినియోగించవచ్చు. అలాగే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నప్పుడు.. వాటితో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. అవి వేరొకరి చేతుల్లో పడితే కచ్చితంగా క్రిమినల్ యాక్టివిటీస్‌కు ఉపయోగిస్తారు. తద్వారా మీకు జైలు శిక్ష పడవచ్చు. కాగా,  మీ సిమ్ కార్డు మిస్సయి.. తప్పుడు వ్యక్తికి దొరికితే.. అతడు దాని ద్వారా వేరొకరికి బెదిరింపు సందేశాలు లేదా కాల్‌లు చేయవచ్చు. అదే జరిగితే.. అది మీరే చేసినట్లు అవుతోంది. జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు. అందుకే మీ సిమ్ పోయిన వెంటనే.. దానిపై ఫిర్యాదు చేయండి. బ్లాక్ చేయించండి. అప్పుడే మీరు సేఫ్‌గా ఉండొచ్చు.