SBI Amrit Kalash FD: సమయం మించిపోతోంది.. ఎఫ్‌డీ చేయాలనుకుంటే ఇప్పుడు చేసేయండి.. ఆన్‌లైన్లో ఎలా చేయాలంటే..

దేశంలోని అతి పెద్ద రుణదాతయైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీసుకొచ్చిన అమృత్ కలాష్ ఒకటి. దీనిలో వినియోగదారులకు అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఎక్కువ వడ్డీరేటును పెట్టుబడిదారులకు అందిస్తుంది. అయితే ఈ పథకం మార్చి 31వ తేదీతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన ఎఫ్‌డీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

SBI Amrit Kalash FD: సమయం మించిపోతోంది.. ఎఫ్‌డీ చేయాలనుకుంటే ఇప్పుడు చేసేయండి.. ఆన్‌లైన్లో ఎలా చేయాలంటే..
Fd Scheme
Follow us

|

Updated on: Mar 23, 2024 | 6:53 AM

డబ్బులు పొదుపు చేసుకోవాలని ఆలోచించే వారికి మొదటి ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ). అంతలా జనాదరణ పొందాయి ఈ పథకాలు. అయితే అన్ని ఎఫ్‌డీ పథకాలు లాభదాయకంగా ఉండవు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేటు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అయితే పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు బ్యాంకర్లు కూడా వివిధ రకాల ఎఫ్‌డీ స్కీమ్లను తీసుకొస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో దేశంలోని అతి పెద్ద రుణదాతయైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీసుకొచ్చిన అమృత్ కలాష్ ఒకటి. దీనిలో వినియోగదారులకు అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఎక్కువ వడ్డీరేటును పెట్టుబడిదారులకు అందిస్తుంది. అయితే ఈ పథకం మార్చి 31వ తేదీతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన ఎఫ్‌డీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్‌డీ స్కీమ్..

ఈ పథకంలో నిర్థిష్ట కాల వ్యవధి ఉంటుంది. 400 రోజులకు మాత్రమే పెట్టుబడులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. 2023, ఏప్రిల్ 12 నుంచి ఈ పథకంలో అందుబాటులో ఉంది. దీనిలో 7.10శాతం వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజెన్స్ కు అయితే 7.60శాతం వడ్డీ రేటు వస్తుంది. మొదట్లో ఇది 2023, డిసెంబర్ 31 వరకూ దీనిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనిని మార్చి 31 వరకూ ఎక్స్ టెండ్ చేశారు.

అకాల ఉపసంహరణలు..

ఈ ఖాతా ప్రారంభించాక 400 రోజుల పాటు డబ్బులు అందులో ఉంచాలి. మెచ్యూరిటీ 400 రోజులకు పూర్తవుతుంది. అలాకాకుండా ప్రీ మెచ్యూర్ విత్ డ్రా చేయాలంటే మాత్రం అదనంగా కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది 0.50శఆతం నుంచి 1శాతం వరకూ ఉంటుంది. అది మీరు డిపాజిట్ చేసిన తేదీ నుంచి విత్ డ్రా చేసే తేదీ మధ్య సమయాన్ని బట్టి ఈ పెలాల్టీ వసలూ చేస్తారు.

అర్హతలు ఇవి..

ఈ పథకాన్ని ఎవరైనా ప్రారంభించవచ్చు. డొమెస్టిక్ రిటైల్ డిపాజిట్స్ కు అవకాశం ఉంటుంది. అందులో ఎన్ఆర్ఐ రూపీ టెర్మ్ డిపాజిట్స్ కు కూడా అవకాశం ఉంటుంది. కొత్త డిపాజిట్లు, లేదా రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు. ఈ పథకం టర్మ్ డిపాజిట్లు, స్పెషల్ టెర్మ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు.

ఎలా ప్రారంభించాలంటే..

ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్‌డీ స్కీమ్ ను ఎస్బీఐ బ్రాంచ్ లో అయినా లేకపోతే ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్, యోనో ఎస్బీఐ యాప్ ద్వారా అయినా ప్రారంభించొచ్చు.

ఆన్ లైన్లో ఎలా ప్రారంభించాలంటే..

  • మొదటిగా మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ లేదా యోనో ఎస్బీఐ యాప్ ద్వారా లాగిన్ చేయాలి.
  • ఆ తర్వాత డిపాజిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సెక్షన్ లోకి వెళ్లి ఫిక్స్ డ్ డిపాజిట్(ఈ-టీడీఆర్/ఈ-ఎస్టీడీఆర్)ను ఎంపిక చేసుకోవాలి.
  • ఎఫ్డీ ఖాతాను ప్రారంభించేందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
  • డిపాజిట్ టెన్యూర్ 400 రోజులకు ఎంపిక చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇంటరెస్ట్ రేటును తీసుకుంటుంది. మీ వయసు ఆధారంగా 7.10, 7.60 వడ్డీ రేటు ఉంటుంది. అదే విధంగా ఎస్బీఐ ఉద్యోగులు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మరో ఒకశాతం అధిక వడ్డీ రేటు వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..