SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా అకాల ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుం బిగించింది. అతితక్కువ వార్షిక ప్రీమియంతో రూ.60 లక్షల భారీ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అసలు ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..
Sbi 60 Lakh Accident Insurance Scheme

Updated on: Feb 16, 2026 | 12:22 PM

సామాన్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడాదికి 3,000 రూపాయల ప్రీమియంతో ఏకంగా 60 లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే రోజుకు కేవలం 8.2 రూపాయలు ఖర్చు చేస్తే, మీ కుటుంబానికి కొండంత అండ దొరుకుతుందన్నమాట. ఈ పాలసీ కేవలం మరణానికే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న కుటుంబానికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.60 లక్షలు అందుతాయి. కుటుంబ యజమానిని కోల్పోయిన పక్షంలో ఇద్దరు పిల్లల విద్య కోసం అదనంగా రూ. 20,000 వరకు సహాయం లభిస్తుంది. తక్షణ సాయం కింద అంత్యక్రియలకు రూ.10,000 ఇస్తారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ ఖర్చుల కోసం రూ. 1,500 ఇస్తారు.

ఎలాంటి ప్రమాదాలకు వర్తిస్తుంది?

  • రోడ్డు లేదా వాహన ప్రమాదాలు.
  • ప్రకృతి వైపరీత్యాలు.
  • పాముకాటు లేదా ఇతర ప్రమాదకర జీవుల వల్ల కలిగే మరణాలు.
  • భవనాలు కూలడం లేదా అగ్ని ప్రమాదాలు.

ఈ మరణాలకు బీమా వర్తించదు

  • అనారోగ్యం లేదా వృద్ధాప్యం వల్ల వచ్చే మరణాలకు బీమా వర్తించదు.
  • ఉద్దేశపూర్వకంగా చేసుకునే ఆత్మహత్య లేదా మరణాలకు వర్తించదు
  • మద్యం లేదా డ్రగ్స్ సేవించి వాహనం నడిపి ప్రమాదం జరిగితే బీమా రాదు.
  • నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు జరిగే ప్రమాదాలు

క్లెయిమ్ చేయడం ఎలా?

ప్రమాదం జరిగిన వెంటనే లేదా మరణించిన వెంటనే సంబంధిత హోమ్ బ్రాంచ్‌కు సమాచారం అందించాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఎఫ్.ఐ.ఆర్ కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్, కేవైసీ పత్రాలను సమర్పించాలి. బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పత్రాలను పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే నేరుగా నామినీ ఖాతాలో డబ్బు జమ చేస్తారు.

అప్లై చేయడం ఎలా?

ఎస్‌బీఐ ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్‌కు వెళ్లి ఒక్కసారి అంగీకార పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ప్రతి ఏటా మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా ప్రీమియం కట్ అయ్యే సదుపాయం ఉండటంతో పదే పదే దరఖాస్తు చేయాల్సిన తలనొప్పి ఉండదు.

Follow Us