
2026 ఏడాది చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోని కోడి మాంసం ధర కొండెక్కింది. గత కొన్ని రోజులుగా 200 నుంచి 250 మధ్య ఉన్న కేజీ చికెన్ ధర ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ప్రతస్తుం మార్కెట్‌లో కేజీ చికెట్ ధర ట్రిపుల్ సెంచరీకి చేరి రూ.300 వరకు పలుకుతోంది. కోడి మాంసమే కాదు.. అటు కోడి గుడ్లు ధర కూడా వినియోగదారులకు షాక్ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క గుడ్డు ధర రూ.8గా పలుకుతోంది. పెరిగిన కోడి మాంసం, గుడ్ల ధరలు చూసి రేట్లు ఇంతలా పెరిగితే తినేదెలారా సామి అని వినియోగదారులు వాపోతున్నారు.
ఇక ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ బ్రాయిలర్ కోడి మాంసం ధర రూ.300గా ఉండగా, లైవ్ కోడి మాంసం కేజీ ధర రూ. 170గా పలుకుతోంది. ఫారం కోడి మాంసం విషయానికి వస్తే కేజీ ధర రూ.180గా ఉండగా బండ కోడి మాంసం ధర రూ.280గా వరకు పలుకుతోంది. అయితే ఏపీలోని పాయకరావుపేట, నక్కపల్లి జిల్లా వ్యాప్తంగా 450 వరకు కోళ్ల పారాలు ఉండగా.. వీటి నుంచి దాదాపుగా 20 లక్షల వరకు కోళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ పౌల్ట్రీలు కేవలం జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా చికెన్ ధరల్లో హెచ్చుతగ్గుళ్లు ఉన్నప్పుటికీ ఎప్పుడూ ఈ స్థాయిలో పెరగలేదు.
అయితే గతంలో బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ధరలు భారీగా తగ్గగా.. ప్రభుత్వ సహకారంతో కోళ్లపారాల యాజమాన్యాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి కొనుగోళ్లను పెంచారు. దీంతో కోడి ధర రూ.285 చేరింది. ఆ తర్వాత ఇది మళ్లీ తగ్గి డిసెంబర్‌లో కేజీ చికెన్ ధర రూ.240-250 మధ్య కొనసాగింది. కానీ డిసెంబర్ చివరి వారం నుంచి ఈ ఏడాది మొదటి వారం మధ్య చికెన్ ధర ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రస్తుతం మర్కెట్‌లో కేజీ చికెన్ రూ. 300కు చేరింది. అయితే చికెన్ ధర భారీగా పెరగడానికి సంక్రాంతి డిమాండ్ కూడా కారణం కావొచ్చని వ్యాపారులు అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.