Reliance Jio Offers: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకపోతోంది. తన కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇతర నెట్వర్క్ కంపెనీల కంటే జియోకు కస్టమర్లు పెరిగిపోతున్నారు. దీంతో ఎప్పటిలాగే రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. జియో ఫోన్ ప్రీ పెయిడ్ యూజర్లకు ‘బై వన్ గెట్ ఫ్రీ వన్’ ఆఫర్లను ప్రకటించింది. ఉదాహరణతో చెప్పాలంటే జియో ఫోన్ యూజర్లు రూ.125తో రిఛార్జ్ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో ఎయిర్టెల్ 46.13 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ కస్టమర్లను సొంతం చేసుకుంది. దీంతో జియో మొత్తం యూజర్లు 43.12 కోట్లకు చేరుకున్నారు. అయితే వీరి సంఖ్యను మరింతగా పెంచేందుకు జియో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంది. ఈ సారి జియో గ్రామాలను టార్గెట్ చేస్తూ కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. జియో ఫోన్ వినియోగదారులకు జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. అందులో రూ.39,రూ.69,రూ.75,రూ.125 రూ.155,రూ.185గా ఉంది.
రూ.39 రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్,14 రోజుల పాటు 100ఎంబీ డేటా అందిస్తుంది. ఆఫర్లో భాగంగా మరో 14 రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందే అవకాశం ఉంటుంది.
అలాగే రూ.69 రీఛార్జ్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 రోజుల పాటు ప్రతీ రోజు 0.5 జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా మరో 14 రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.
రూ.75 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను అందిస్తుంది. ఆఫర్లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు.
రూ.125 రీఛార్జ్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అలాగే ప్రతిరోజు 0.5 జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు.
రూ.155 రీఛార్జ్ ప్లాన్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా సొంతం చేసుకోవచ్చు.
రూ.185 రీఛార్జ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అలాగే ప్రతి రోజు 2జీబీడేటాను అందిస్తుండగా ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను వినియోగించుకునేలా రిలయన్స్ జియో ఆఫర్లను ప్రకటించింది. ఇలా రకరకాల ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది జియో. ఇతర నెట్‌వర్క్‌ల కంటే అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకురావడంతో జియోకు కస్టమర్లు పెరిగిపోతున్నారు.