RBI Penalty: ఈ మూడు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఏంటంటే!

|

Sep 15, 2023 | 8:20 PM

సహకార బ్యాంకులుగా ఉన్న ఈ నాలుగు బ్యాంకుల పేర్లను దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది . రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వివరాల ప్రకారం.. జరిమానా విధించబడిన బ్యాంకుల్లో బారామతి కోఆపరేటివ్ బ్యాంక్, బెచరాజీ సిటిజన్స్ కోఆపరేటివ్ బ్యాంక్, వాఘోడియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు విరామ్‌గామ్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కారణాల వల్ల ఈ బ్యాంకులన్నింటికీ జరిమానాలు విధించింది.

RBI Penalty: ఈ మూడు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఏంటంటే!
RBI
Follow us on

దేశంలో నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరడా ఝులిపిస్తుంటుంది. భారీ ఎత్తున జరిమానా విధిస్తుంటుంది. గుజరాత్‌లోని మూడు బ్యాంకులతో సహా దేశంలోని నాలుగు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) భారీ జరిమానాలు విధించింది. ఈ బ్యాంకులు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదు. దర్యాప్తు సమయంలో ఈ బ్యాంకులు మార్గదర్శకాలను పాటించలేదని, దీనివల్ల భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సహకార బ్యాంకులుగా ఉన్న ఈ నాలుగు బ్యాంకుల పేర్లను దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది . రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వివరాల ప్రకారం.. జరిమానా విధించబడిన బ్యాంకుల్లో బారామతి కోఆపరేటివ్ బ్యాంక్, బెచరాజీ సిటిజన్స్ కోఆపరేటివ్ బ్యాంక్, వాఘోడియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు విరామ్‌గామ్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి.

  • బారామతి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 2 లక్షల రూపాయలు
  • బేచరాజీ సిటిజన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 2 లక్షల రూపాయలు
  • వాఘోడియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు 5 లక్షల రూపాయలు
  • విరామ్‌గాం మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.5 లక్షల రూపాయల జరిమానా విధించారు.

ఆర్బీఐ ప్రకటన?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కారణాల వల్ల ఈ బ్యాంకులన్నింటికీ జరిమానాలు విధించింది. నిబంధనలను పాటించాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు, ఆంక్షలు విధించవచ్చు. అయితే దేశంలో ఇప్పటికే చాలా బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదని ఆర్బీఐ చెబుతోంది. దీంతో బ్యాంకులపై ప్రత్యేక నిఘా పెట్టి అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే తమ దర్యాప్తులో రూల్స్‌ పాటించడం లేదన్న విషయం తేలిన తర్వాతే జరిమానా విధిస్తున్నామని ఆర్బీఐ చెబుతోంది. ఇప్పటికే చాలా బ్యాంకులకు లక్షలాది రూపాయలు జరిమానా విధిస్తోంది ఆర్బీఐ. అలాగే కొన్ని బ్యాంకులకు కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. మరి కొన్ని బ్యాంకుల లైసెన్స్‌లు సైతం రద్దు చేస్తోంది ఆర్బీఐ.

ఇవి కూడా చదవండి

సైబర్ సెక్యూరిటీ నిబంధనలను విస్మరించడం:

కొద్ది రోజుల క్రితం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో బ్యాంకుపై జరిమానా విధించింది. ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ రూ. 65 లక్షల జరిమానా విధించారు. ఈ బ్యాంకుల్లోకి హ్యాకర్లు చొరబడి 12.48 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు.

వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులకు జరిమానాలు విధిస్తారు. దీన్ని బ్యాంకులు చెల్లించాలి. ఇందులో ఖాతా తెరిచే వ్యక్తులు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు లేదా దానిపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పెనాల్టీని బ్యాంకు స్వయంగా చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి