జనవరి-మార్చి 2025 త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త సంవత్సరంలో ఈ వడ్డీ రేట్లు పెరుగుతాయని సామాన్యులు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 చివరి త్రైమాసికంలో ఈ పథకాలపై వడ్డీ రేట్లు మునుపటిలాగే కొనసాగుతాయి. పోస్ట్ ఆఫీసుల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (POTD), మహిళా సమ్మాన్ సేవింగ్స్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌తో సహా చిన్న పొదుపు పథకాలు ఉన్నాయి. వీటిపై వచ్చే వడ్డీలో ఎలాంటి మార్పు లేదు.
ఇది కూడా చదవండి: Gold Price: 2025లో తులం బంగారంపై రూ.10 వేలకుపైగా పెరగనుందా? రికార్డ్‌లు బద్దలేనా..!
ఇది కూడా చదవండి: Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు చివరిగా జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో మార్పు జరిగింది. అయితే, ఆ సమయంలో కూడా అన్ని పథకాల వడ్డీ రేట్లను మార్చలేదు. అప్పుడు మూడు సంవత్సరాల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు మాత్రమే సవరించింది కేంద్రం. ఏప్రిల్ 2024 నుండి ఈ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.
ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు, ఇతర పాలసీ రేట్లను కూడా తగ్గించగలదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చేటప్పుడు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. గత కొన్ని త్రైమాసికాల్లో, ఈ రేట్లు స్థిరంగా లేదా స్వల్పంగా పెంచింది. అందుకే ఈ రేట్లలో అకస్మాత్తుగా పెద్ద కోతకు అవకాశం లేదు.
ఇది కూడా చదవండి: ITR Deadline: ఐటీఆర్ ఫైల్ చేయని వారికి బిగ్ రిలీఫ్.. గడువు పొడిగింపు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి