అటు రాజకీయాల్లో.. ఇటు ఇంటర్నెట్లో.. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పాలిటిక్స్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టారంటే చాలు.. కోట్లలో లైకులు, షేర్లు, కామెంట్స్ వచ్చిపడతాయి. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబార్లు ఉన్న రాజకీయ నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకంటూ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ప్రసారమవుతాయి. మరి ఈ ఛానెల్‌కు ఎంతమంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.
ప్రధాని మోదీకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాతో సహా వివిధ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆయనకు ఓ అధికారిక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఈ ఛానల్ 2007 అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించారు. ఈ ఛానెల్‌కు 26 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా.. ఇప్పటివరకు 29,272 వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఇక ఆ వీడియోలకు మొత్తం 636 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఈ ఛానెల్ ద్వారా ప్రధాని మోదీకి నెలకు రూ. 1.62 కోట్ల నుంచి రూ. 4.88 కోట్ల ఆదాయం వస్తోందట.
ఇది చదవండి: టీ కోసం డాబా దగ్గర కారు ఆపారు.. తీరా డ్రైవర్ చేసిన పనికి బిత్తరపోయారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి