
దేశవ్యాప్తంగా రైతుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నిధులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ మేరకు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా ఈ సొమ్మును రిలీజ్ చేయనున్నారు. 24వ విడత కింద ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేడు రూ.2 వేలు జమ కానున్నాయి. రైతులు ఈ నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు మరికొన్ని గంటల్లో వారి నిరీక్షణకు తెరపడనుంది. మొత్తం 93.4 మిలియన్ల మంది రైతులకు రూ.18,680 కోట్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.4.47 లక్షల కోట్లు లబ్దిదారులకు అందించారు. గత విడతతో పోలిస్తే ఈ సారి అనర్హులుగా తేలిన 10 లక్షల మందిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు.
-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి
-హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగంలో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి
-మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా నమోదు చేయాలి
-అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి
-పీఎం కిసాన్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి
-అనంతరం గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి
-మీ పీఎం కిసాన్ స్టేటస్ అక్కడ కనిపిస్తుంది
-అందులో 24వ ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి
-దీంతో మీకు డబ్బులు అందుతాయా.. లేదా అనేది అక్కడ చూసుకోవచ్చు
అయితే పీఎం కిసాన్ నగదు అందుకోవాలంటే తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీరు పీఎం కిసాన్ మొబైల్ యాప్ లేదా పోర్టల్ ద్వారా స్వయంగా చేసుకుంటే ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే రూ.15 సేవా రసుము చెల్లించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ వివరాలు నమోదు చేసి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీ ముఖం స్కాన్ చేస్తే సరిపోతుంది. నిమిషాల్లోనే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తమవుతుంది. ఇది పెండింగ్‌లో ఉంటే పీఎం కిసాన్ నగదు అందవు. మళ్లీ పూర్తి చేసుకున్న తర్వాతనే జమ అవుతాయని కేంద్రం తెలిపింది.