Fact Check: ఎంట్రా ఇలా తయారయ్యారు.. ఇలాంటివి చూసే జనాలు పరేషాన్ అవుతున్నారు..!

PIB Fact Check: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఫేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న వీడియో నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించినట్లు PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటువంటి..

Fact Check: ఎంట్రా ఇలా తయారయ్యారు.. ఇలాంటివి చూసే జనాలు పరేషాన్ అవుతున్నారు..!
Fact Check News

Updated on: Jun 03, 2026 | 8:44 AM

PIB Fact Check: ఈ సోషల్ మీడియా యుగంలో సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పెట్టుబడి వేదికను ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం రూ.22,000 ప్రారంభ పెట్టుబడితో నెలకు రూ.3.5 లక్షల వరకు సంపాదించవచ్చని ఆ వీడియో పేర్కొంది. అయితే, పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ వాదనను పూర్తిగా అవాస్తవమని కొట్టివేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఫేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న వీడియో నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించినట్లు PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటువంటి ఏ పెట్టుబడి వేదికను లేదా పథకాన్ని ఆమోదించలేదని పీఐబీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Telangana: చరిత్రలో తొలిసారి ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF సాయం

సవాలుగా మారుతోన్న డీప్‌ఫేక్ టెక్నాలజీ

డీప్‌ఫేక్ టెక్నాలజీ పెరుగుతున్న దుర్వినియోగాన్ని ఈ కేసు స్పష్టం చేస్తోంది. డీప్‌ఫేక్‌లు ఒక వ్యక్తి చిత్రం, వీడియో లేదా స్వరాన్ని వాస్తవికంగా కనిపించేలా చేయడానికి కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగిస్తాయి. ఈ వైరల్ వీడియోలో కూడా ప్రధానమంత్రి పాత వీడియో ఫుటేజ్‌ను ఉపయోగించారు. ఆయన ఏదో పెట్టుబడి పథకాన్ని ప్రచారం చేస్తున్నట్లుగా కనిపించేలా చేయడానికి, AI టెక్నాలజీని ఉపయోగించి ఆయన స్వరం, ప్రదర్శనను మార్చారు. దీనిని నమ్మిన ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. వారిని తప్పుదోవ పట్టించడమే ఇటువంటి నకిలీ వీడియోల ఉద్దేశ్యం వైరల్‌ అవుతున్నాయని, ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పీఐబీ సూచిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో

 

 

నకిలీ వార్తలను ఇలా నివేదించండి:

తప్పుదారి పట్టించే ప్రభుత్వ సంబంధిత వార్తలను వెలికితీయడానికి మీరు పిఐబి ఫ్యాక్ట్ చెక్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఎవరైనా తప్పుదారి పట్టించే వార్తా కథనం స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా యూఆర్‌ఎల్‌ను వాట్సాప్ నంబర్ 8799711259 ద్వారా పిఐబి ఫ్యాక్ట్ చెక్‌కు పంపవచ్చు లేదా factcheck@pib.gov.in కు ఇమెయిల్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us