Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత ఉందో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత ఉందో తెలుసా..
Petrol Price

Updated on: Oct 22, 2021 | 8:34 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి. శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.18గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 104.32గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.104.47గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 111.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 104.37గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.93గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.01గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.30 ఉండగా.. డీజిల్ ధర రూ.104.43గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.70 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.86గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.113.76 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.23 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.96 ఉండగా.. డీజిల్ ధర రూ. 104.53గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.85లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.105.36గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.40గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.92గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 113.76 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.106.23లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 106.89 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.78కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.63 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.107.44 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 98.73 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 104.01 ఉండగా.. డీజిల్ ధర రూ.100.01గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.110.21 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.101.49గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.86 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.07గా ఉంది.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi Speech: ఈ ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ..

Loading...
Unable to load recommendations.
Follow Us