Petrol-Diesel Rates Today: అమ్మకాలు తగ్గినా.. పరుగు ఆపని పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol-Diesel Rates Today: కరోనా వ్యాప్తి పెరుగుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడంతో పెట్రోల్ అమ్మకాలు...

Petrol-Diesel Rates Today: అమ్మకాలు తగ్గినా.. పరుగు ఆపని పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol Price Today

Updated on: May 13, 2021 | 6:55 AM

Petrol-Diesel Rates Today: కరోనా వ్యాప్తి పెరుగుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒక వైపు లాక్ డౌన్. మరో వైపు ఎటు తిరిగితే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ప్రజల్ని ఇళ్ళకు కట్టి పాడేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నేపధ్యంలో అన్ని రంగాలూ ఏప్రిల్ నెలలో గట్టి తిరోగమన ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఇక ఎక్కడా ప్రజల ప్రయాణాలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.67గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 90.06గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.82 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.90.06 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 95.73గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.10 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.07గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.43గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.86ఉండగా.. డీజిల్ ధర రూ.90.24 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.26 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.67 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 98.06కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 91.88 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96096 ఉండగా.. డీజిల్ ధర రూ.90.84గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.09 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.91.88 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.08 గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.06లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.91.88 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.05గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.61 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.36కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.75 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.16 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.45గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 93.84 ఉండగా.. డీజిల్ ధర రూ.87.49గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.11 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.57 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.09ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.82.74 గా ఉంది.

ఇవి కూడా చదవండి: Nasal Vaccine: ముక్కుద్వారా కరోనా టీకా..ఎందుకు ఇది గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు? భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?

Land registrations : తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలకు తాత్కాలిక బ్రేక్

Loading...
Unable to load recommendations.
Follow Us