Petrol Diesel Price: వాహనదారులకు చల్ల చల్లని వార్త.. ఎనిమిదో రోజు పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు..

నేటికీ పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు . ఈరోజు వరుసగా ఎనిమిదో రోజు పెట్రోలు, డీజిల్ ధరలు మారలేదు. ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వ చమురు..

Petrol Diesel Price: వాహనదారులకు చల్ల చల్లని వార్త.. ఎనిమిదో రోజు పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు..
representative image

Updated on: Apr 13, 2022 | 8:53 AM

Petrol Diesel Price Today: నేటికీ పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు . ఈరోజు వరుసగా ఎనిమిదో రోజు పెట్రోలు, డీజిల్ ధరలు మారలేదు. ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. బుధవారం కూడా ఇంధన ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. వాస్తవానికి మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మొదలైంది. ఈ సమయంలో, మార్చి 24 , ఏప్రిల్ 1 న ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ అప్పటి నుంచి చమురు ధర నిరంతరం పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్-డీజిల్ ధరలు ఎలా పెరిగాయో.. తగ్గాయో తెలుసుకుందాం.. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.105.49గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.22గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.105.23గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 116.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.39గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.65గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.07గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49 ఉండగా.. డీజిల్ ధర రూ.105.49గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.02గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.120.10ఉండగా.. డీజిల్ ధర రూ. 105.74గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.121.28లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.106.83గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.19గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.80గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.121.32లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.106.90లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.67లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.77 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.115.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 99.83 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.84ఉండగా.. డీజిల్ ధర రూ.100.94గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.88గా ఉంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోండి

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్ , డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL (HPCL) వినియోగదారులు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..

Loading...
Unable to load recommendations.
Follow Us