
దేశంలో పెట్రోల్, డీజిల్ పెరిగాయి. ప్రముఖ ప్రైవేట్ ఇంధన వ్యాపార సంస్థ అయిన నయారా ఎనర్జీ ధరలను గురువారం పెంచింది. నేటి నుంచే ఈ పెంపు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచగా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ధరలను పెంచాల్సి వచ్చినట్లు నయారా సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,02,7 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. నయారా సంస్థ 6,967 స్టేషన్లను నిర్వహిస్తోంది

సేకరణ, సరఫరా ఖర్చులు పెరుగుతుండటంతో సంస్థపై భారం పడుతోంది. దీంతో ప్రజలకు ఖర్చులను బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల పన్నులు,వ్యాట్‌ను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు అనేవి మారుతూ ఉంటాయి. దీంతో నయారా సంస్థ ప్రకటన తర్వాత ఆ బంక్‌ల్లో ఏయే సిటీలలో ఎంతవరకు పెరిగాయో చూద్దాం.

ఈ పెంపు తర్వాత హైదరాబాద్‌లోని నయారా పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46కి చేరుకుంది. ఇక ముంబై, కోల్ కత్తాలో ధరలు రూ.100 దాటాయి. కొన్ని సిటీల్లో రూ.5.30 వరకు పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో డీజిల్ ధర రూ.95.70గా ఉంది. దేశంలో అత్యధిక ధరలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. టైర్-1 నగరాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది.

మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. సిలిండర్లు సకాలంలో సరఫరా కావడం లేదు. పాకిస్తాన్‌లో పెట్రోల్ చాలా ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో డీజిల్ ధర 54.9 శాతం పెరిగి లీటరుకు రూ. 520.35కు చేరింది. పెట్రోల్ ధర 42.7 శాతం పెరిగి లీటరుకు రూ. 458.40కు చేరింది.

ఇక భువనేశ్వర్‌లో డీజిల్ రూ.92.77, చెన్నైలో రూ.92.39, కోల్‌కత్తాలో రూ.92.02, బెంగళూరులో రూ.90.99, ముంబైలో రూ.90.03, నోయిడాలో రూ.88.31, గుర్గావ్‌లో రూ.88.03, ఢిల్లీలో రూ.87.67, చండీగఢ్‌లో రూ.82.45గా ఉంది. ఇంధన ధరలపై నియంత్రణ లేదని, చమురు సంస్థలే స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయని కేంద్రం తెలిపింది.