SBI Safety Tips: లోన్ యాప్స్ వాడుతున్నవారు తప్పక పాటించవలసిన జాగ్రత్తలివే.. లేకపోతే మోసపోవడం ఖాయం..!

లోన్ యాప్స్ ద్వారా అనేక మోసాలు, దారుణాలు జరుగుతూ ఉండడాన్ని కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొని రెండు మూడు రెట్లు అప్పులు చెల్లించినవారు కూడా ఉన్నారు. అప్పు తీర్చలేక..

SBI Safety Tips: లోన్ యాప్స్ వాడుతున్నవారు తప్పక పాటించవలసిన జాగ్రత్తలివే.. లేకపోతే మోసపోవడం ఖాయం..!
Tips To Follow Before Taking Loan From Apps
Follow us

|

Updated on: Jan 25, 2023 | 6:04 PM

లోన్ యాప్స్ ద్వారా అనేక మోసాలు, దారుణాలు జరుగుతూ ఉండడాన్ని కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొని రెండు మూడు రెట్లు అప్పులు చెల్లించినవారు కూడా ఉన్నారు. అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఇప్పటికీ లోన్ యాప్స్ నిర్వాహకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు లోన్ తీసుకునేవారిలో అవగాహన లోపం కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలోనే పోలీసుల దగ్గర నుంచి బ్యాంకుల వరకు అందరూ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు కూడా తన కస్టమర్లను లోన్ యాప్స్ విషయంలో హెచ్చరిస్తోంది. లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల పేర్లతో వచ్చే అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదని, మీ సమాచారాన్ని ఎవరితో షేర్ చేయకూడదని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఇలాంటివి వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరుతోంది. అంతేకాదు, లోన్ యాప్స్ విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ 6 టిప్స్ షేర్ చేసింది ఎస్‌బీఐ. అవేమిటంటే..

Sbi Tips To Follow Before Taking Loan From Apps

ఇవి కూడా చదవండి

1. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ విశ్వసనీయత(రిలయబిలిటీ)ను చెక్ చేయాలి.

2. అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదు.

3. అనధికార యాప్స్‌ని ఉపయోగించకూడదు. ఈ యాప్స్ మీ డేటా దొంగిలించే అవకాశముంది.

4. మీ డేటా దొంగిలించకుండా యాప్ పర్మిషన్ సెట్టింగ్స్ పరిశీలించాలి.

5. అనుమానాస్పద మనీ లెండింగ్ యాప్స్ గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

6. మీ ఆర్థిక అవసరాల కోసం http://bank.sbi వెబ్‌సైట్‌ సందర్శించాలి.

ఎస్‌బీఐ సూచిస్తున్న ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ డేటా కాపాడుకోవడంతో పాటు, మోసాలకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు రుణాలు తీసుకోవాలనుకుంటే ఆర్‌బీఐ గుర్తించిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. గుర్తుతెలియని వ్యక్తులు, అనధికార యాప్స్‌లో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ షేర్ చేయకూడదు.

ఫేక్ యాప్స్ విషయంలో జాగ్రత్త:

బ్యాంకింగ్ యాప్స్, లోన్ యాప్స్ మాత్రమే కాదు, ఇతర ఏ యాప్స్ డౌన్‌లోడ్ చేయాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి. అధికారిక యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. థర్డ్ పార్టీ యాప్స్, ఏపీకే ఫైల్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయకూడదు. యాప్ ఇన్‌స్టాల్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి. ప్లేస్టోర్‌లో ఒకే యాప్ లాగా అనేక యాప్స్ కనిపిస్తాయి. అందుకే ఒరిజినల్ యాప్ ఏదో గుర్తించడం తప్పనిసరి. కొత్తగా ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఓసారి రివ్యూస్ చదవాలి. నెగిటీవ్ రివ్యూస్ పైన దృష్టిపెట్టాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!