
డిజిటల్ లావాదేవీలు చేసుకునే సౌకర్యం రావడం, ప్రభుత్వ పథకాల నగదు నేరుగా అకౌంట్లలో జమ చేస్తున్న ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్ అనేది అందరికీ అవసరమే. దీంతో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారు. వేర్వురు అవససరాల కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నారు. అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లిమిట్, ఎక్కువ సంవత్సరాలు ట్రాన్సక్షన్లు ఎలాంటివి జరగకపోతే అకౌంట్‌ను ఇనాక్టివ్ చేస్తున్న క్రమంలో బ్యాంకు అకౌంట్లను చాలామంది మూసివేస్తున్నారు. క్లోజింగ్ ఫారంను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అకౌంట్‌ను మూసివేసే సమయంలో మీరు చేసే కొన్ని పనులు మీకు నష్టం కలిగించవచ్చు.
అకౌంట్ వాడకపోతే మినిమం బ్యాలెన్స్ ఫైన్లు పడవని చాలామంది అనుకుంటారు. కానీ మీ నుంచి బ్యాంకులు ఏటీఎం, ఎస్ఎంఎస్, పాస్‌బుక్, సేవా ఛార్జీలు ప్రతీ ఏడాది వసూలు చేస్తాయి. జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటి ఛార్జీలన్నీ మైనస్ రూపంలో పడతాయి. అకౌంట్ మూసివేసే సమయంలో వాటిని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటి బ్యాలెన్స్‌ను ముందుగానే చెక్ చేసుకోండి.
మీరు డెబిట్ కార్డు వాడినా, వాడకపోయినా బ్యాంకులు ప్రతీ ఏడాది వార్షిక రుసుంలు వసూలు చేస్తాయి. ఇవి రూ.250 నుంచి రూ.700 వరకు ఉంటాయి. వీటిని మీరు బ్యాంక్ అకౌంట్ మూసివేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక మీ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్, కరెంట్ బిల్లు, లోన్ల ఈఎంఐలు, పాలసీ ప్రీమియంలు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంటే అకౌంట్ క్లోజ్ చేసేముందు వాటిని రద్దు చేసి వేరే బ్యాంక్‌కు లింక్ చేసుకోండి. ఒకవేళ మీరు పాత అకౌంట్‌కే ఉంచుకుంటే ఆటోమేటిక్ డెబిట్ ఫెయిల్ అయినప్పుడు బ్యాంకులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తాయి. దాని వల్ల మీరు నష్టపోతారు.
కొన్ని బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లను ఒక ఏడాది తర్వాత ఎలాటి ఛార్జీలు చెల్లించకుండా మూసివేయవచ్చు. మరికొన్ని బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన 6 నుంచి 12 నెలల్లోపు మూసివేస్తే రూ.200 నుంచి రూ.500 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక మీరు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ పొందటానికి అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటే దానిని నిలిపివేసే ముందు దానిని చెక్ చేసుకోండి