ఓలా కంపెనీ ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 ఈ పేరుతో తాజా ఈవీలను రిలీజ్ చేసింది.వ్యక్తిగత అవసరాల కోసం పట్టణ, సెమీ-అర్బన్ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ స్కూటర్లను చార్జ్ చేయడానికి పోర్టబుల్ హెూమ్ ఇన్వర్టర్ ఉపయోగించవచ్చు. ఫిక్స్డ్ బ్యాటరీలు ఉన్న స్కూటర్లతో పోలిస్తే రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్లతో వచ్చే స్కూటర్లను ఇటీవల వినియోగదారులు అధికంగా ఇష్టపడడంతో అన్ని కంపెనీలు రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్‌తో వచ్చే ఈవీలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కూడా తాజాగా రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్‌తో స్కూటర్లను రిలీజ్ చేసింది. ఈ బ్యాటరీలను ఈజీగా ఇంట్లో లేదా కార్యాలయంలో ఛార్జ్ చేయవచ్చు.
ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 ఈ స్కూటర్లు కొన్ని భిన్నమైన వేరియంట్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. బేస్ మోడల్ వ్యక్తిగత ఉపయోగాలను అందిస్తుంది, టాప్-స్పెక్ జెడ్ ప్లస్ మోడల్ ప్రైవేట్ మరియు వాణిజ్య అవసరమయ్యేలా డ్యూయల్-యూజ్ ఈ-స్కూటర్‌గా లాంచ్ చేశారు. ఓలా ఎస్1 జెడ్ బాక్సీ సిల్హౌట్‌తో వస్తుంది. టాప్-స్పెక్ జెడ్ ప్లస్ వేరియంట్ రెండు చివర్లలో కార్గో రాక్స్, పిలియన్ సైడ్ స్టెప్, వైజర్, మొబైల్ ఫోన్ హెూల్డర్ వంటి అదనపు ఉపకరణాలతో వస్తున్నాయి. బేస్ వెర్షన్ 12 అంగుళాల చక్రాలతో వస్తుంది. అయితే ఎస్1జెడ్ ప్లస్ 14 అంగుళాల ఎంపికలతో వస్తుంది. ఈ రెండు మోడల్‌లు రైడర్ కోసం ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తున్నాయి.
ఓలా ఎస్1 జెడ్ శ్రేణి 2.9 కేడబ్ల్యూ హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 4 బీహెచ్పీ శక్తితో వస్తుంది. ఓలా ఎస్1 జెడ్ 8 సెకన్లలో 20 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అలాగే 4.8 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఓలా ఎస్1 జెడ్ 1.5 కేడబ్ల్యహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక బ్యాటరీ ప్యాక్‌తో ఎస్1 జెడ్ ఓ చార్జీపై ఐడీసీ సర్టిఫైడ్ 75 కిమీ పరిధిని అందిస్తుంది. ఓలా జెడ్1 రూ.59,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. అలాగే ఓలా ఎస్1 జెడ్ ప్లస్ వేరియంట్ రూ.64,999 ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ స్కూటర్లు 499 టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్ డెలివరీలు మే 2025న షెడ్యూల్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి