మార్చి నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నెల ప్రారంభం కానుండడంతో డబ్బుకు సంబంధించి అనేక నియమాలు మారనున్నాయి. వీటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్, క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు ఉన్నాయి. మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఏప్రిల్ 1 నుండి ఏ నియమాలు మారబోతున్నాయో తెలుసుకోండి.
ఈ 5 నియమాలు మారుతాయి
ఎన్‌పిఎస్ ఖాతాలోకి లాగిన్ అవ్వాలంటే టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్‌పీఎస్ చందాదారులు ఈ మోసాల బారిన పడకుండా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తన లాగిన్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎన్‌పీఎస్ ఖాతాకు లాగిన్ చేయడానికి ఎన్‌పీఎస్ ఖాతాదారులకు వినియోగదారు ఐడీ, పాస్‌వర్డ్ అలాగే ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ అవసరం. పీఎఫ్‌ఆర్‌డీఏ ఎన్‌పీఎస్‌లో ఆధార్ ఆధారిత లాగిన్ ప్రమాణీకరణను ప్రవేశపెట్టబోతోంది. ఈ రూల్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలు:
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు చేదు వార్త. ఇప్పుడు అద్దె చెల్లింపుపై అందుకున్న రివార్డ్ పాయింట్లు ఏప్రిల్ 1 నుండి నిలిచిపోనున్నాయి. ఇందులో ఎస్‌బీఐ AURUM, SBI కార్డ్ ఎలైట్, ఎస్‌బీఐ కార్డ్ పల్స్, ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, SimplyClICK క్రెడిట్ కార్డ్‌లలో ఈ సదుపాయం నిలిచిపోనుంది.
యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు కోసం యెస్ బ్యాంక్ కీలక నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో కనీసం రూ. 10,000 ఖర్చు చేయడం ద్వారా ఇప్పుడు వినియోగదారులు దేశీయ విమానాశ్రయ లాంజ్‌కి ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ నుంచే వర్తించనున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పు
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా మార్చబోతోంది. ఏప్రిల్ 1, 2024 నుండి కస్టమర్‌లు త్రైమాసికంలో రూ.35,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వారికి కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
ఓలా మనీ వాలెట్ నియమాలలో మార్పు
ఓలా మనీ తన వాలెట్ నియమాలను ఏప్రిల్ 1, 2024 నుండి మార్చబోతోంది. చిన్న పీపీఐ (ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్) వాలెట్ సర్వీస్ పరిమితిని రూ. 10,000కి పెంచబోతున్నట్లు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా కంపెనీ తన కస్టమర్‌లకు తెలియజేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి