Nissan Weekend Carnival: ఆఫర్ల కార్నివాల్.. ఆ కారు కొనుగోలుపై ఏకంగా రూ. 1.35లక్షల వరకూ ఆదా..

నిస్సాన్ మోటార్ ఇండియా 'వీకెండ్ కార్నివాల్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది, ఇది జూన్ 15-16, తేదీల్లో అమలవుతోంది. దేశంలోని నిస్సాన్ డీలర్ షిప్ నెట్ వర్క్ అన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఈ వీకెండ్ కార్నివాల్లో భాగంగా నిస్సాన్ 'ఎన్ఎంఐపీఎల్ లాయల్టీ ప్రోగ్రామ్ 'ను ప్రవేశ పెట్టింది. ఇది నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 1,35,100 వరకు ప్రయోజనాలను అందిస్తోంది

Nissan Weekend Carnival: ఆఫర్ల కార్నివాల్.. ఆ కారు కొనుగోలుపై ఏకంగా రూ. 1.35లక్షల వరకూ ఆదా..
Nissan Magnite
Follow us

|

Updated on: Jun 10, 2024 | 4:54 PM

నిస్సాన్ కార్లకు మన దేశంలో మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా నిస్సాన్ మాగ్నైట్ కారు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఈ క్రమంలో నిస్సాన్ మోటార్ ఇండియా ‘వీకెండ్ కార్నివాల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది, ఇది జూన్ 8-9, జూన్ 15-16, తేదీల్లో అమలవుతోంది. దేశంలోని నిస్సాన్ డీలర్ షిప్ నెట్ వర్క్ అన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఈ వీకెండ్ కార్నివాల్లో భాగంగా నిస్సాన్ ‘ఎన్ఎంఐపీఎల్ లాయల్టీ ప్రోగ్రామ్ ‘ను ప్రవేశ పెట్టింది. ఇది నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 1,35,100 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాల్లో ప్రత్యేక ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు, 3-సంవత్సరాల ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. ఈ నిస్సాన్ వీకెండ్ కార్నివాల్ గత వారం ప్రారంభవగా.. వచ్చే వీకెండ్ అంటే జూన్ 15,16 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వీటికి ఆఫర్ లేదు..

నిస్సాన్ మాగ్నైట్ అన్ని వేరియంట్లకు ఈ వీకెండ్ కార్నివాల్ ఆఫర్లు వర్తించవని కంపెనీ పేర్కొంది. మాగ్నైట్ ఎంటీ ఎక్స్ఈ, ఏఎంటీ ఎక్స్ఈ వేరియంట్లకు వర్తించవు. అలాగే కార్నివాల్ సమయంలో కస్టమర్లు బుకింగ్ చేసిన తర్వాత కొన్ని బహుమతులు, ఉపకరణాలను అతిథుల చేతుల మీదుగా అందుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని యాక్సెసరీలు, డిస్కౌంట్లను గెలుచుకోడానికి లక్కీ డ్రా కూడా జరుగుతుంది.

పెరుగుతున్న విక్రయాలు..

నిస్సాన్ ఇటీవలే బలమైన అమ్మకాల గణాంకాలను ప్రకటించింది. మొత్తం టోకు విక్రయాలు 6,204 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఏప్రిల్ 2024 (3,043 యూనిట్లు)తో పోల్చితే 104 శాతం గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. మే 2023 నుంచి (4,631 యూనిట్లు) వార్షికంగా 34 శాతం వృద్ధిని సూచిస్తుంది (4,631 యూనిట్లు). తన వృద్ధి వ్యూహంలో భాగంగా, నిస్సాన్ ఇండియా తన డీలర్షిప్ నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. శ్రీనగర్, సేలం, ఢిల్లీ, దుర్గాపూర్లలో ఇటీవలి చేర్పులు వారి మొత్తం టచ్ పాయింట్లను 272కి తీసుకువచ్చాయి. దేశవ్యాప్తంగా కస్టమర్లకు మెరుగైన విక్రయాలు, సేవా అనుభవాలను అందిస్తాయి. ఈ నెట్ వర్క్ విస్తరణ రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ మాగ్నైట్ కొత్త వేరియంట్..

నిస్సాన్ ఇండియా మాగ్నైట్ లైనప్కి కొత్త జోడింపును ప్రకటించింది. GEZA CVT స్పెషల్ ఎడిషన్. దీని ధర రూ. 39.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్ ప్రీమియం ఫ్లెయిర్ను పొందాలనుకునే బడ్జెట్ కాన్షియస్ కొనుగోలుదారుల కోసం ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికను అందిస్తుంది. GEZA CVT స్పెషల్ ఎడిషన్ స్పోర్టియర్ కురో బ్లాక్ ఎడిషన్ కింద ఉంది. దీని ఫీచర్లను గమనిస్తే.. దీనిలో పెద్ద 9 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ప్రీమియం జేబీఎల్ స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. అదనపు సౌలభ్యం, భద్రత కోసం వెనుక వీక్షణ కెమెరాతో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్