Mothers Day 2025: బీఎస్ఎన్ఎల్ మదర్స్ డే ఆఫర్స్.. ఆ రీచార్జ్‌లపై ప్రత్యేక తగ్గింపు..!

ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించింది ఏదీ లేదు. మరో రెండు రోజుల్లో రానున్న మదర్స్ డే వేడుకల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ తల్లికి మరపురాని బహుమతులను ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ వేడుకల్లో బీఎస్ఎన్ఎల్ పాలు పంచుకుంటుందని ప్రకటించారు. ఈ మేరకు మదర్స్ రోజు కోసం ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Mothers Day 2025: బీఎస్ఎన్ఎల్ మదర్స్ డే ఆఫర్స్.. ఆ రీచార్జ్‌లపై ప్రత్యేక తగ్గింపు..!
BSNL రూ.1,515 ప్లాన్: ఈ ప్లాన్‌లో మీరు ఒక సంవత్సరం చెల్లుబాటును పొందుతారు. అంటే పూర్తి 365 రోజులు. అలాగే ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాకుండా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ లేనప్పటికీ, వినియోగదారులు ఏడాది పొడవునా మొత్తం 720GB డేటాను పొందుతారు.

Updated on: May 08, 2025 | 2:47 PM

బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించిన మూడు దీర్ఘకాలిక వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లు ఇప్పుడు మదర్స్ డే ప్రత్యేక ఆఫర్‌లో ధరలు భారీగా తగ్గించారు. ఈ తగ్గింపు ధరలు మే 14 వరకు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులంతా ఈ కొత్త ఆఫర్ల ద్వారా ప్రయోజనం పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తన మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై 5 శాతం తగ్గింపును అధికారికంగా  ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ఆఫర్‌ను అందించింది. 

రూ. 2399 ప్లాన్

రూ.2399 రీచార్జ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, అపరిమిత వాయిస్ కాల్స్ సదుపాయాలను బీఎస్ఎన్ అందిస్తుంది. అదనంగా బైటీవీకు ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. దీని వల్ల వినియోగదారులు తమ ఫోన్‌లలో 350 కి పైగా లైవ్ టీవీ స్టేషన్‌లను వీక్షించవచ్చు.

రూ. 997 ప్లాన్ 

ఈ ప్యాక్ వినియోగదారులకు 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా బై టీవీకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

రూ. 599 ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు రోజువారీ 3 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. అలాగే భారతదేశం అంతటా అపరిమిత కాల్స్ సదుపాయాన్ని ఆశ్వాదించవచ్చు. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే బై టీవీకి ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us