Tiger 660 Sport : మార్కెట్లోకి లగ్జరీ బైక్‌.. అత్యాధునిక ఫీచర్స్‌.. ధర, ఇతర వివరాలు..!

 Tiger 660 Sport : మార్కెట్లో రోజురోజుకు కొత్త బైక్‌లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న బైక్‌ తయారీ కంపెనీలు.. అత్యాధునిక..

Tiger 660 Sport : మార్కెట్లోకి లగ్జరీ బైక్‌.. అత్యాధునిక ఫీచర్స్‌.. ధర, ఇతర వివరాలు..!
Tiger 660 Sport

Updated on: Mar 29, 2022 | 8:12 AM

Tiger 660 Sport: మార్కెట్లో రోజురోజుకు కొత్త బైక్‌లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న బైక్‌ తయారీ కంపెనీలు.. అత్యాధునిక ఫీచర్స్‌తో బైక్‌ (Bike)లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక ప్రముఖ లగ్జరీ బైక్‌ల తయారీ కంపెనీ ట్రయంఫ్‌ మోటార్స్‌ సరికొత్త ద్విచక్ర వాహన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ట్రయంఫ్‌ (Triumph Tiger) టైగర్‌ స్పోర్ట్‌ 660ను మార్చి 29న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. టైగర్‌ లైనప్‌లో ఎంట్రీ లెవల్‌, అత్యంత సరసమైన ధరలలో ప్రముఖ లగ్జరీ బైక్ల తయారీదారు ట్రయంఫ్‌ మోటార్స్‌ సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది. ట్రయంఫ్‌ టైగర్‌ లైనప్‌లో భాగంగా ‘టైగర్ స్పోర్ట్స్‌660’ను మార్చి 29, 2022న భారత్‌లో విడుదల చేయనుంది. టైగర్‌ లైనప్‌లో ఎంట్రీ లెవల్‌, అత్యంత సరసమైన ధరలో ఈ బైక్‌ నిలుస్తుందని కంపెనీ తెలిపింది.

గత వారం ట్రయంఫ్‌ మోటార్స్‌ తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో కొత్త బైక్‌ టీజర్‌ విడుదల చేసింది. భారతదేశంలో తమ టైగర్‌ లైనప్‌లో 850 స్పోర్ట్స్‌, టైగర్‌ 900 బైక్స్‌ ఉన్నాయి. ఇక ఈ రోజు విడుదలయ్యే టైగర్‌ స్పోర్ట్స్‌ 660.. ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌తో ఎయిర్‌ వెంట్‌, బైక్‌కు ముందు భాగంలో పొడవైన విండ్‌ స్క్రీన్‌తో స్పోర్టీలుక్‌ను పొందనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్‌లో బ్లూటూత్‌ కనెక్టీవిటీ కలిగిన ఎల్‌ఈడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్‌తో రానుంది. అలాగే ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ఇంజన్‌ను పోలీ ఉండనుంది. 660cc ఇన్‌లైన్-త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 81 hp శక్తిని, 64 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ట్రెయిన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జత చేసే అవకాశం ఉంది. ఈ బైక్‌ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఈ బైక్‌ ధర రూ.8.5 లక్షలుగా ఉండనున్నట్లు అంచనా ఉంది.

ఇవి కూడా చదవండి:

FD Schemes: ఈ రెండు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే మార్చి 31 వరకే

Airbags: కారు ప్రయాణం ఇక మరింత సురక్షితం.. కేంద్రం కీలక ప్రకటన.. కొత్త నియమ, నిబంధనలు.. ఎప్పటి నుంచి అంటే..