UPI Payments: భారత దేశ యూపీఐపై ఇతర దేశాల ఆసక్తి..జీ 20 సమావేశాల్లో కీలక పరిణామం

భారత దేశంలో ఎన్ పీసీఐ అభివృద్ది చేసిన యూపీఐ పేమెంట్స్ పై ఇతర దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. జీ 20 సమావేశంలో తమకు భారత్ యూపీఐ యొక్క సాంకేతిక మద్దతును అందించాలని కోరుతున్నాయి. ఎన్ పీసీఐ చీఫ్ అండ్ సీఈఓ దిలీప్ అస్బె వివరాలను అందించారు.

UPI Payments: భారత దేశ యూపీఐపై ఇతర దేశాల ఆసక్తి..జీ 20 సమావేశాల్లో కీలక పరిణామం
UPI
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2023 | 6:35 PM

ప్రస్తుతం జరుగుతున్న జీ 20 సమావేశాల్లో రెమిటెన్స్ ఖర్చులను తగ్గించడంపై అన్ని దేశాలు దృష్టి సారించాయి. ప్రస్తుతం ఇతర దేశాల్లో పని చేస్తున్న కార్మికుల చెల్లింపుల ఖర్చు మొత్తం చెల్లింపుల విలువలో 6 శాతంగా ఉంది. 2027 నాటికి రెమిటెన్స్‌ల వ్యయాన్ని సగటున మూడు శాతానికి తగ్గించడమే లక్ష్యంగా జీ 20 దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఎన్ పీసీఐ అభివృద్ది చేసిన యూపీఐ పేమెంట్స్ పై ఇతర దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. జీ 20 సమావేశంలో తమకు భారత్ యూపీఐ యొక్క సాంకేతిక మద్దతును అందించాలని కోరుతున్నాయి. ఎన్ పీసీఐ చీఫ్ అండ్ సీఈఓ దిలీప్ అస్బె వివరాలను అందించారు. అనేక దేశాలు భారత్ తరహాలో స్వదేశి యూనిఫైడ్ పేమెంట్స్ ను అవలంభించాలని చూస్తున్నాయని ఆయన వివరించారు. అయితే తమకు కోరిన దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్‌వేర్ అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటమాని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మాత్రం దాదాపు 12 నెలల సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం యూపీఐ ద్వారా ఏడాదికి 280 మిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయని, భవిష్యత్ బిలియన్ లావాదేవీల జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ అభివృద్ధి, అమలు చిన్న దేశాలకు భారం అవుతుందని, అలాంటి దేశాలకు తగిన శిక్షణ ద్వారా వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. 

సింగపూర్ పే నౌతో భారత్ యూపీఐ లింక్  

జీ 20 సమావేశాల్లో సింగపూర్ ప్రతినిధి మాట్లాడుతూ త్వరలో సింగపూర్ లో భారత్ యూపీఐ తరహాలో పే నౌ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. అయితే పే నౌ ను యూపీఐను అనుసంధానించడం ద్వారా రిమెటెన్స్ ఖర్చులు దాదాపు 10 శాతం తగ్గే అవకాశం ఉందని వివరించారు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల పౌరులు, ఎన్ఆర్ఐలు, టూరిస్టులకు లాభం చేకూరనుందని పేర్కొన్నారు. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ చీఫ్ ఫిన్‌టెక్ ఆఫీసర్ సోప్నేందు మొహంతి మాట్లాడుతూ, ఒకసారి స్థాపించిన తర్వాత, రెండు డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్ యొక్క ఇంటర్‌ఆపరేబిలిటీ రెండు దేశాల మధ్య రెమిటెన్స్‌లలో బహుళ రెట్లు వృద్ధికి సహాయపడుతుందన్నారు. అలాగే దుబాయ్ వంటి దేశాలు కూడా భారత్ యూపీఐపై ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..