Business Ideas: కాస్త ఆలోచన ఉంటే చాలు, పెట్టుబడి లేకుండానే సంపాదించొచ్చు.. ఎలా అంటే..

|

Oct 25, 2023 | 11:30 AM

ఎన్నో వినూత్న ఆలోచనలు ఉన్నా పెట్టుబడి లేక తమ ఆలోచనలు ఆదిలోనే ముగిసి పోతున్నాయి. అయితే కాస్త తెలివి ఉండాలే కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేసుకోవచ్చు. మంచి ఐడియాలతో వ్యాపారాలను ప్రారంభించొచ్చు. అయితే పేరుకు చిన్న వ్యాపారాలే అయినా వీటిలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌తో చిన్న వ్యాపారాలను పెద్దగా కూడా మార్చుకోవచ్చు. ఇంతకీ అసలు పెట్టుబడి లేకుండా...

Business Ideas: కాస్త ఆలోచన ఉంటే చాలు, పెట్టుబడి లేకుండానే సంపాదించొచ్చు.. ఎలా అంటే..
Business Ideas
Follow us on

ప్రస్తుతం యువత ఆలోచనల్లో మార్పు వస్తున్నాయి. ఒకప్పటిలా ఉద్యోగం కంటే సొంత వ్యాపారానికే మొగ్గు చూపుతున్నారు. చిన్నదైనా సరే సొంతంగా సంపాదించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఏదైనా వ్యాపారం చేయాలంటే కచ్చితంగా కావాల్సింది పెట్టుబడి. దీంతో ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో తెలియక, అధిక వడ్డీలు చల్లించలేక చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు.

ఎన్నో వినూత్న ఆలోచనలు ఉన్నా పెట్టుబడి లేక తమ ఆలోచనలు ఆదిలోనే ముగిసి పోతున్నాయి. అయితే కాస్త తెలివి ఉండాలే కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేసుకోవచ్చు. మంచి ఐడియాలతో వ్యాపారాలను ప్రారంభించొచ్చు. అయితే పేరుకు చిన్న వ్యాపారాలే అయినా వీటిలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌తో చిన్న వ్యాపారాలను పెద్దగా కూడా మార్చుకోవచ్చు. ఇంతకీ అసలు పెట్టుబడి లేకుండా ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు.? వీటివల్ల ఆదాయాన్ని ఎలా పొందొచ్చు.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

* తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో వస్త్ర వ్యాపారం ఒకటి. పెట్టుబడి లేకుండా వస్త్రాలు ఎలా కొనుగోలు చేసేది అంటారా.? మీకు దగ్గరల్లో ఉన్న హోల్‌ సేల్‌ బట్టల షాప్‌లో దుస్తులను కొనుగోలు చేసి వీధుల్లో అమ్మవచ్చు. దుస్తులు అమ్మిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని షాపు యజమానులతో ఒప్పందం కూడా చేసుకొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బైక్‌లపై ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

* మీరు ఒకవేళ పల్లెటూర్లలో నివస్తున్నట్లుతే.. అక్కడ పాలు, నెయ్యి వంటివి కొనుగోలు చేసి పట్టణాల్లో అమ్ముకోవచ్చు. గ్రామాల్లో స్వచ్ఛమైన నెయ్యి, పాలు దొరుకుతాయ్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి లూజ్‌గా అమ్మితే మంచి ఆదాయం పొందొచ్చు. అలాగే స్వీట్‌ షాప్స్‌లో కూడా నెయ్యి, పాలను అమ్మొచ్చు.

* ప్లాస్టిక్‌ నిషేధిస్తున్న ఈ రోజుల్లో పేపర్‌ కవర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఇంట్లోనే న్యూస్‌ పేపర్స్‌తో కవర్లను తయారు చేసి దుకాణాల్లో అమ్మొచ్చు. రంగురంగుల పేపర్స్‌తో తయారు చేస్తే ఈ కవర్స్‌కి మరింత గిరాకీ ఉంటుంది.

* ఇక ఇటీవల ప్రతీ చోట వారాంతాల్లో మార్కెట్స్‌ నిర్వహిస్తున్నారు. ఇంట్లో అరిసెలు, మురుకులు వంటి వంటకాలను తయారు చేసి అమ్ముకోవచ్చు. హోమ్‌ ఫుడ్‌ కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని ఇష్టపడుతుంటారు.

* ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని మంచి వ్యాపార ఆలోచనగా మార్చుకోవచ్చు. హోల్‌సేల్ మార్కెట్లో పండ్లను కొనుగోలు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అమ్ముకోవచ్చు. కాలేజీలు, ఆఫీసుల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తే మంచి లాభాన్ని ఆర్జించవచ్చు.

* ఇక బాదాం, కాజు, గుమ్మడి గింజలను హోల్‌సేల్‌గా తెచ్చుకొని చిన్న ప్యాకెట్స్‌గా చేసి కిరాణా షాపుల్లో అమ్ముకోవచ్చు. వీటికి కూడా ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా ఉంటే మంచి గిరాకీ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..