Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులపై కూడా చార్జీల బాదుడు.. ఏయే చార్జీలు విధిస్తారంటే..?

భారతదేశంలో ఇటీవల కాలంలో  క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న చిన్న అవసరాలకు ఇతరులను చేబదులు అడిగే కంటే క్రెడిట్ కార్డులతో ఆ అవసరాలను తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులంటేనే చార్జీల బాదుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ విషయంలో కూడా నిజమేనని పలు సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా యాన్యువల్ ఫీజుతో ఇతర చార్జీలు క్రెడిట్ కార్డుదారులను ఇబ్బందిపెడుతూ ఉంటాయి.

Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులపై కూడా చార్జీల బాదుడు.. ఏయే చార్జీలు విధిస్తారంటే..?
Credit Card
Follow us

|

Updated on: Jul 20, 2024 | 4:00 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో  క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న చిన్న అవసరాలకు ఇతరులను చేబదులు అడిగే కంటే క్రెడిట్ కార్డులతో ఆ అవసరాలను తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులంటేనే చార్జీల బాదుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ విషయంలో కూడా నిజమేనని పలు సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా యాన్యువల్ ఫీజుతో ఇతర చార్జీలు క్రెడిట్ కార్డుదారులను ఇబ్బందిపెడుతూ ఉంటాయి. క్రమేపి బ్యాంకుల మధ్య పోటీ కారణంగా చాలా బ్యాంకులు లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందించడంతో ఫ్రీనే కదా అని చాలా మంది ఆ క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు.  అయితే ఆయా కార్డుల్లో హిడెన్ చార్జీల బాదుడు ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఫ్రీ క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఏయే చార్జీలపై జాగ్రత్తగా ఉండాలో? ఓసారి తెలుసుకుందాం. 

జాయినింగ్ ఫీజు, వార్షిక ఛార్జీలు

చాలా క్రెడిట్ కార్డ్‌లకు జాయినింగ్ ఫీజు, వార్షిక ఛార్జీలు విధిస్తాయి. ముఖ్యంగా ఫ్రీ క్రెడిట్ కార్డులో జాయినింగ్ ఫీజు వసూలు చేస్తారు. ఈ  నేపథ్యంలో కార్డు తీసుకునే ముందు ఆ చార్జీలపై అవగాహనతో ఉండాలి. కొన్ని బ్యాంకులు జాయినింగ్ ఫీజును రివార్డ్ పాయింట్స్ పేరుతో భర్తీ చేస్తాయి. అందువల్ల కార్డు తీసుకునే ముందు నిబంధనలను తనిఖీ చేయాలి. 

ఫైనాన్స్ ఛార్జీలు

మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లించకపోతే మిగిలిన బ్యాలెన్స్‌పై బ్యాంక్ ఫైనాన్స్ ఛార్జీలను వర్తింపజేస్తుంది. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి, చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించకుండా మొత్తం బిల్లును క్లియర్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నగదు అడ్వాన్స్ 

మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ కంపెనీలు లేదా బ్యాంకుల ద్వారా ఈ రుసుము విధిస్తాయి.

పెట్రోల్ సర్‌ఛార్జ్

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసేటప్పుడు సర్‌ఛార్జ్ వర్తిస్తుందని చాలా మంది కార్డ్ వినియోగదారులకు తెలియదు. కాబట్టి పెట్రోల్ బంకుల వద్ద కార్డులను వినియోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఫారెక్స్ మార్కప్ ఫీజు

మీరు విదేశాల్లో లావాదేవీల కోసం మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు కార్డ్ కంపెనీలు ఫారెక్స్ మార్కప్ రుసుమును విధిస్తాయి.

కార్డ్ రీప్లేస్‌మెంట్ 

కార్డు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన సందర్భాల్లో కంపెనీలు రీప్లేస్‌మెంట్ కార్డ్‌ను జారీ చేయడానికి రుసుము వసూలు చేస్తాయి.

ఓవర్ పరిమితి 

మీరు మీ క్రెడిట్ కార్డ్ సూచించిన పరిమితిని మించి ఉంటే బ్యాంకులు లేదా కార్డ్ కంపెనీలు అటువంటి లావాదేవీల కోసం ఓవర్-లిమిట్ రుసుమును వసూలు చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులపై కూడా చార్జీల బాదుడు..!
లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులపై కూడా చార్జీల బాదుడు..!
పెరగనున్న ముద్ర లోన్ లిమిట్! బడ్జెట్‌పై ఎంఎస్ఎంఈ రంగం ఆశలు..
పెరగనున్న ముద్ర లోన్ లిమిట్! బడ్జెట్‌పై ఎంఎస్ఎంఈ రంగం ఆశలు..
వర్షాకాలంలో ఏసీ వాడకపోతే పాడైపోతుందా..? ఆఫ్ చేసి ఉంచితే ఏమవుతుంది
వర్షాకాలంలో ఏసీ వాడకపోతే పాడైపోతుందా..? ఆఫ్ చేసి ఉంచితే ఏమవుతుంది
ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్..అప్లయ్ చేయడం కూడా ఈజీనే..!
ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్..అప్లయ్ చేయడం కూడా ఈజీనే..!
Team India: కోహ్లీ-రవిశాస్త్రి షమీకి అన్యాయం చేశారా?
Team India: కోహ్లీ-రవిశాస్త్రి షమీకి అన్యాయం చేశారా?
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం!!
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం!!
వీకెండ్‌లో బయటకి వెళ్లాలని ప్లాన్‌ చేశారా? ఈ MMTS రైళ్లు రద్దు
వీకెండ్‌లో బయటకి వెళ్లాలని ప్లాన్‌ చేశారా? ఈ MMTS రైళ్లు రద్దు
చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..?
చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..?
భారతీయుడు రిజల్ట్ సర్ఫిరాకి ప్లస్ అయిందా.? క్రిటిక్స్ ఏమంటున్నారు
భారతీయుడు రిజల్ట్ సర్ఫిరాకి ప్లస్ అయిందా.? క్రిటిక్స్ ఏమంటున్నారు
కాస్ట్యూమ్‌ డ్రామాతోనే సత్తా.. ఏంటా సినిమాలు.? ఎలా ఉండబోతున్నాయి.
కాస్ట్యూమ్‌ డ్రామాతోనే సత్తా.. ఏంటా సినిమాలు.? ఎలా ఉండబోతున్నాయి.
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?