AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..? నిబంధనలు తెలిస్తే షాకవుతారు

భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. ఏ పనికైనా ఆధార్ కార్డు ఆధారమైందని చెబితే అతిశయోక్తి కాదేమో. ఏదైనా పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాలన్నా, హోటల్‌లో చెక్ ఇన్ చేయాలన్నా, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టీటీకి గుర్తింపు ప్రూఫ్ చూపించాలన్నా ఇలా అన్ని చోట్లా ఉపయోగపడుతుంది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య.

Aadhaar Card: చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఏం చేయాలో తెలుసా..? నిబంధనలు తెలిస్తే షాకవుతారు
Aadhaar Card
Nikhil
|

Updated on: Jul 20, 2024 | 3:32 PM

Share

భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. ఏ పనికైనా ఆధార్ కార్డు ఆధారమైందని చెబితే అతిశయోక్తి కాదేమో. ఏదైనా పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాలన్నా, హోటల్‌లో చెక్ ఇన్ చేయాలన్నా, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టీటీకి గుర్తింపు ప్రూఫ్ చూపించాలన్నా ఇలా అన్ని చోట్లా ఉపయోగపడుతుంది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది. ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఆధార్ మోసగాళ్ల చేతిలో పడితే అది దుర్వినియోగం కావచ్చు. అందువల్ల అటువంటి పరిస్థితిని నివారించడానికి, ఆధార్‌ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డును ఏం చేయాలో? ఎప్పుడైనా ఆలోచించారా? మరణించిన వారి ఆధార్ కార్డును సరెండర్ చేయాలా? లేదా డీయాక్టివేట్ చేయాలా? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ద్వారా ఆధార్ కార్డు జారీ చేస్తారు. అయితే వయస్సుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా మూసివేయడం గురించి ఇంకా ఎటువంటి నియమాలు రూపొందించలేదు. అంటే కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత, మీరు అతని ఆధార్ కార్డును సరెండర్ చేయలేరు లేదా రద్దు చేయలేరు. అయితే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి యూఐడీఏఐ అందించే ఆధార్ లాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా మీకు కావాల్సిన వారి ఆధార్ సురక్షితంగా ఉంచడమే కాకుండా దానిని ఎవరూ దుర్వినియోగం చేయలేరు. ఆధార్ కార్డును దానిని ఉపయోగించడం కష్టం అవుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అది దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అతని/ఆమె ఆధార్ కార్డును లాక్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డును లాక్ చేయడం ఇలా

  • ఆధార్‌ను లాక్ చేయడానికి ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి. ఆ తర్వాత మై ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 
  • అనంతరం మై ఆధార్‌లోని ఆధార్ సేవలకు వెళ్లి, ‘లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్’ ఎంపికను ఎంచుకోవాలి.
  • దీని తర్వాత స్క్రీన్‌పై కొత్త పేజీ వస్తుంది. ఈ కొత్త పేజీలో లాగిన్ అవ్వడానికి మీరు లాక్ చేయాలనుకుంటున్న 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీను పూరించాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ నుండి లాక్ ఎంపికను ఎంచుకుంటే ఆధార్ కార్డు లాక్ అవుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు