
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. గంటల వ్యవధిలోనే భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం ధరలు పడిపోగా.. సాయంత్రం నాటికి ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటుండటంతో పసిడి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తగ్గేంత వరకు బంగారం, సిల్వర్ ధరల్లో ఇలాగే అస్థిరత కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం మళ్లీ మొదలైంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. ధరలు మళ్లీ పెరిగాయి. ధరలు పెరిగిన తర్వాత ప్రస్తుతం ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
-గురువారం సాయంత్రం నాటికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,440 వద్ద కొనసాగుతోంది. ఒక్కసారిగా రూ.1310 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,32,400 వద్ద ట్రేడవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రూ.1200 మేర హైక్ అయ్యాయి.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,220 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,200 వద్ద ట్రేడవుతోంది
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,440 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,400గా ఉన్నాయి.
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,590 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,550 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
-ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,44,440 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,400 వద్ద కొనసాగుతోంది.
-భారత బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,440 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,400 వద్ద ట్రేడవుతున్నాయి.
-విజయవాడలో కేజీ వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది.
-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది
-చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2.45 లక్షలుగా ఉంది.