Best Jio Recharge Plans: జియో ప్రీపెయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు.. రూ.500లలోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

ప్రీపెయిడ్ యూజర్లకు రిలయన్స్ జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. వార్షిక ప్లాన్‌ల నుంచి నెలవారీ రీఛార్జ్‌లతోపాటు చిన్న డేటా టాప్ అప్‌లను కూడా జియో ప్రతి ఒక్కరికీ..

Best Jio Recharge Plans: జియో ప్రీపెయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు.. రూ.500లలోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
Jio Recharge Plans

Updated on: Mar 13, 2023 | 7:16 PM

ప్రీపెయిడ్ యూజర్లకు రిలయన్స్ జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. వార్షిక ప్లాన్‌ల నుంచి నెలవారీ రీఛార్జ్‌లతోపాటు చిన్న డేటా టాప్ అప్‌లను కూడా జియో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 500లోపు జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు, జియో హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

రూ. 500లోపు జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్లు ఇవే..

జియో రూ 119 ప్లాన్:

ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే 14 రోజులపాటు1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

జియోరూ 149 ప్లాన్:

ఈ ప్యాక్ వ్యాలిడిటీ 20 రోజులు. వ్యాలిడిటీ ముగిసే వరకు ప్రతి రోజూ 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

జియో రూ. 179 ప్లాన్:

ఈ ప్యాక్‌ 24 రోజులపాటు1జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

జియో రూ. 199 ప్లాన్:

ఈ ప్యాక్‌ 23 రోజులపాటు 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

జియో రూ. 209 ప్లాన్:

ఈ ప్యాక్‌ 28 రోజులపాటు1జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

జియో రూ. 239 ప్లాన్:

ఈ ప్లాన్ 28 రోజుల పాటు 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

జియో రూ. 249 ప్లాన్:

ఈ ప్లాన్ 5G జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తున్నారు. 23 రోజులపాటు 2జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది.

జియో రూ. 259 ప్లాన్:

ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీని అందిస్తుంది. 1.5జిబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌ల యాక్సెస్‌ అందిస్తుంది. దీనికి జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కూడా వర్తిస్తుంది. ఈ ప్లాన్‌ యాక్టివ్ చేసుకున్న వినియోగదారులు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాను పొందవచ్చు.

జియో రూ. 296 ప్లాన్:

ఈ ప్లాన్ కింద 30 రోజుల పాటు 25జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తుంది.

జియో రూ. 299 ప్లాన్:

జియో ప్రీపెయిడ్ బెస్ట్ సెల్లింగ్ రీఛార్జ్ ప్లాన్‌లలో ఇది ఒకటి. 28 రోజుల వ్యాలిడిటీ, 2జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియో యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us