
చాలా మంది లోన్ అంటే కంటే కచ్చితంగా వడ్డీ ఉంటుందని, పైగా అధిక వడ్డీలతో తిరిగి కట్టాల్సిన మొత్తం తడిసిమోపెడు అవుతుందని అనుకుంటారు. నిజానికి వడ్డీలేని లోన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వడ్డీ లేని లోన్లలో ప్రభుత్వం పేద ప్రజలకు ఏదో ఒక పథకంలో ఇస్తుందని అనుకునేరు. అలా ఏం కాదు.. ఈ వడ్డీ లేని లోన్లు మంచి సిబిల్ స్కోర్ ఉన్న ఎవరికైనా లభిస్తాయి.
క్రెడిట్ కార్డ్ ఉన్న వారికి ఈ వడ్డీలేని లోన్లు తీసుకోవడం ఈజీ.. ఎలాగంటే మీకు ఏదైనా వస్తువు అవసరం ఉండి, మీ వద్ద డబ్బు లేకుంటే మీ క్రెడిట్ కార్డ్ వాడి దాన్ని కొనుగోలు చేయొచ్చు. అయితే క్రెడిట్ కార్డ్‌తో కట్టిన డబ్బును తిరిగి గ్రేస్ పీరియడ్‌లోపు మళ్లీ కార్డ్‌లో జమచేస్తే మీరు తీసుకున్న డబ్బుకు వడ్డీ పడదు. అయితే ఆ గ్రేస్ పీరియడ్ అనేది 50 రోజులు ఉంటుంది. సో.. 50 రోజుల వరకు మీరు వడ్డీలేని రుణం పొందినట్లే. అయితే 50 రోజులు దాటితే మాత్రం వడ్డీ పడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు.
అలాగే నో కాస్ట్ ఈఎంఐ.. దీన్ని చాలా మంది మార్కెటింగ్ స్ట్రాటజీగా భావిస్తారు. కానీ, నిజానికి నో కాస్ట్ ఈఎంఐ కూడా వడ్డీలేని రుణం తీసుకోవడానికి ఒక మంచి ఎంపిక. మీరు ఏదైనా గ్యాడ్జెట్, ఎలక్ట్రానిక్ వస్తువు.. లైక్ ఫోన్, ల్యాప్‌టాప్, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్ వంటివి తీసుకుంటే.. వాటి ధరను రూ.6 నుంచి 9 నెలలలోపే కట్టేస్తే మీరు తీసుకున్న లోన్‌పై వడ్డీ పడదు. అయితే అవి ఆయా కంపెనీలు ఇచ్చే ఆఫర్లు, మీరు ఫైనాన్స్ తీసుకునే సంస్థలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది నో కాస్ట్ ఈఎంఐపై వడ్డీ వసూలు చేయకున్నా.. ప్రాసెసింగ్ ఫీజు అంటూ కొంత తీసుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి