
పాకిస్తాన్‌తో స్నేహం చేసి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన దేశాలకు భారతీయులు సరిగ్గా బుద్ధి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడి, పాక్ స్నేహాన్ని కొనసాగించిన టర్కీ, అజర్‌బైజాన్‌లకు చాలా నష్టం వాటిల్లింది. వాటి పర్యాటక వ్యాపారాలు కుప్పకూలిపోయాయి. భారత పర్యాటకులు ఈ రెండు దేశాలలో ఖర్చు చేయడం మానేశారు. ఒకప్పుడు భారతీయులతో నిండిన విమానాలు, హోటళ్ళు ఇప్పుడు నిర్జనమైపోయాయి. ఆదాయంలో తీవ్ర తగ్గుదల ఈ రెండు దేశాలను భారత్‌తో పెట్టుకుంటే వారి ఆర్థిక వ్యవస్థలకు ఇంత నష్టమా అని లెక్కలేసుకుంటున్నాయి.
నివేదికల ప్రకారం.. ఒకప్పుడు టర్కీ, అజర్‌బైజాన్‌లకు వారి అందాలను చూడటానికి వెళ్ళే భారతీయ పర్యాటకులు ఇప్పుడు సందర్శించడానికి వెనుకాడుతున్నారు. జూన్ నుండి డిసెంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం అజర్‌బైజాన్‌కు వెళ్ళే భారతీయ సందర్శకుల సంఖ్య 63 శాతం తగ్గింది. టర్కీకి వెళ్ళే పర్యాటకుల సంఖ్య కూడా 34 శాతం తగ్గింది. 2024 జూన్, డిసెంబర్ మధ్య దాదాపు 153,000 మంది భారతీయ పర్యాటకులు అజర్‌బైజాన్‌ను సందర్శించారు, కానీ గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య కేవలం 57,000 కు పడిపోయింది.
అదేవిధంగా 2024 ఈ అర్ధభాగంలో టర్కీని 205,000 మంది భారతీయులు సందర్శించగా, గత సంవత్సరం కేవలం 135,000 మంది మాత్రమే పర్యటించారు. ఈ తగ్గుదల స్పష్టంగా భారతీయ పర్యాటకులు తమ సెలవుల కోసం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న దేశాలను ఎంచుకోవడానికి వెనుకాడడం లేదని సూచిస్తుంది. భారత్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌తో పాటు, పాక్‌లోని పలు ఉగ్ర స్థావరాలపై ఈ దాడులు చేసింది. ఆ సమయంలో పాక్‌కు ఈ రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. దాంతో భారతీయులు ఈ దేశాలపై తమ ఆగ్రహం ఈ విధంగా వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి