Indian Railways: రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు.. ఏకంగా రూ.75 డౌన్.. ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. కొన్ని రైళ్లల్లో టికెట్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొన్ని రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్ల హోదా నుంచి రెగ్యూలర్ సర్వీసులుగా మార్చారు. దీంతో ఈ రైళ్లల్లో టికెట్ ధరలు తగ్గనున్నాయి.

Indian Railways: రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు.. ఏకంగా రూ.75 డౌన్.. ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్..
Indian Railways

Updated on: Nov 06, 2026 | 8:18 AM

ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. కొన్ని రైళ్లల్లో టికెట్ ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. క్లాస్‌ను బట్టి ఒక్కొ టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 వరకు తగ్గవచ్చు. దేశవ్యాప్తంగా ఏకంగా 40కిపైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యూలర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనుంది. వేగం అందుకోనందున జనవరి 1 నుంచి ఈ రైళ్లకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హోదా తప్పించి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, రెగ్యూలర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు టికెట్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. దీంతో రెగ్యూలర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని టికెట్ ధరలే వీటికి వర్తించనున్నాయి. దాదాపు 47 రైళ్లల్లో టికెట్ ఛార్జీలు తగ్గనున్నాయి.

జనవరి 1 నంచి అమల్లోకి..

గంటకు 55 కిలోమీటరల్ వేగం అందుకోవడంలో వైఫల్యం చెందినందుకు దేశంలోని 47 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జనవరి 1 నుంచి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగానే పరిగణించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. సూపర్ ఫాస్ట్ హోదాను తొలగించి సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా నడపనుంది. దీంతో వీటిల్లో టికెట్ల ధరలు తగ్గుతుండటం సామాన్య ప్రయాణికులకు ఊరటగా చెప్పవచ్చు. అలాగే ఈ రైళ్ల నెంబర్లు, సర్ ఛార్జ్ మారనుండగా.. టైమ్ షెడ్యూల్ ఎప్పటిలాగే ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం సూపర్ ఫాస్ట్ ట్రైన్ రెండు దిశల్లోనూ కనీసం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. రైల్వేశాఖ పరిశీలనలో ఈ రైళ్లు వేగాన్ని అందుకోలేకపోయినట్లు తేలింది. దీంతో రెగ్యూలర్ ఎక్స్‌ప్రెస్‌లుగా వాటిని మార్చనున్నారు. సెంట్రల్ రైల్వే పరిధిలో CSMT-పూణే ప్రగతి, LTT-అయోధ్య కంటోన్మెంట్ తులసితో సహా 18 సర్వీసులు ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో సప్త క్రాంతితో సహా 20 సర్వీసులు ఉన్నాయి. తానక్‌పూర్-ఢిల్లీ, డెహ్రాడూన్-కాఠ్‌గోడమ్‌తో సహా మరో ఎనిమిది ఉత్తరాఖండ్ మార్గాలు ఉండగా.. గోవా ఎక్స్‌ప్రెస్ కూడా జాబితాలో ఉంది.

చార్జీలు ఎంత తగ్గుతాయంటే..?

ఈ రైళ్లల్లో జనవరి 1 నుంచి సెకండ్ క్లాస్ టికెట్ల ధర రూ.15, స్లీపర్ క్లాస్ చార్జీ రూ.30, ఏసీ చైర్ కార్, థర్డ్ టైర్, సెకండ్ టైర్ టికెట్ ధర రూ.45, ఏపీ ఫస్ట్ క్లాస్ టికెట్ల ధర రూ.75 వరకు తగ్గే అవకాశముంది. దీని వల్ల ప్రయాణికులకు భారీగా డబ్బులు ఆదా కానున్నాయి. చెన్నై ఎగ్మోర్-రామేశ్వరం, తాంబరం-తిరుచిరాపల్లి రైళ్లతో సహా తమిళనాడులోని ఎనిమిది రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మారనున్నాయని దక్షిణ రైల్వే వెల్లడించింది. అయితే టికెట్లను బుక్ చేసుకునేవారు మారిన ట్రైన్ నెంబర్లను గుర్తించాలని రైల్వేశాఖ సూచించింది. కొత్త టికెట్ ధరలు జనవరి నుంచి అప్డేట్ అయ్యే ఛాన్సుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us