Gold Rate: బంగారం కొనేవారికి షాక్.. 67 శాతం పెరిగిన ఛార్జీలు.. ఎందుకంటే?

Gold Latest News: భారత్‌లో బంగారం మార్కెట్‌కు సంబంధించి రెండు కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు అక్రమ బంగారం దిగుమతులు ఏకంగా 1500 శాతం పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఛార్జీలు 67 శాతం పెరిగాయి. దీంతో పండుగల సీజన్‌లో బంగారం కొనేవారిపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

Gold Rate: బంగారం కొనేవారికి షాక్.. 67 శాతం పెరిగిన ఛార్జీలు.. ఎందుకంటే?
Gold Hallmarking Charges

Updated on: Nov 04, 2026 | 9:24 AM

Gold Rate: భారత్‌లో బంగారం కొనుగోళ్లు, దిగుమతులకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోకి అక్రమంగా బంగారం తరలింపు భారీగా పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) సమాచారం ప్రకారం.. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అక్రమ బంగారం దిగుమతులు ఏకంగా 1500 శాతం పెరిగాయి. గతంలో 3 మెట్రిక్ టన్నులుగా ఉన్న ఈ దిగుమతులు ప్రస్తుతం 50 మెట్రిక్ టన్నులకు చేరాయి. 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి ఇదే కావడం గమనార్హం.

కస్టమ్స్ సుంకాల పెంపుతో స్మగ్లింగ్?

ఇటీవల ప్రభుత్వం కస్టమ్స్ సుంకాలను పెంచిన నేపథ్యంలో అక్రమ బంగారం రవాణా పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక పన్నుల కారణంగా కొందరు వ్యాపారులు, కొనుగోలుదారులు అధికారిక మార్గాలకు బదులుగా అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రయాణికుల లగేజీ ద్వారా బంగారం తరలించే ఘటనలు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే సుంకాల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

బంగారం కొనేవారికి మరో షాక్.. 67 శాతం పెరిగిన ఛార్జీలు

మరోవైపు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి అదనపు ఖర్చు ఎదురుకానుంది. బంగారం హాల్‌మార్కింగ్ ఛార్జీలను పెంచుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. 2026 సెప్టెంబర్ 14 నుంచి అమలవుతున్న సవరించిన ధరల ప్రకారం.. ఒక్కో బంగారు ఆభరణానికి హాల్‌మార్కింగ్ ఛార్జీ రూ.45 నుంచి రూ.75కు పెరిగింది. అంటే దాదాపు 67 శాతం పెరుగుదల నమోదైంది.

ఒక్కో ఆభరణానికి ఎంత చెల్లించాలి?

కొత్త నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాలకు ఒక్కో బంగారు ఆభరణంపై రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఒక కన్సైన్‌మెంట్‌కు కనీస ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. హాల్‌మార్కింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా ఒక్కో ఆభరణంపై రూ.7.50 బీఐఎస్ ఫీజు కూడా వర్తిస్తుంది.

బంగారం కొనేటప్పుడు ఈ విషయం మర్చిపోవద్దు..

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ధర, తరుగు, మేకింగ్ ఛార్జీలతో పాటు హాల్‌మార్కింగ్ వివరాలను కూడా పరిశీలించాలి. ముఖ్యంగా ఆభరణంపై చెల్లుబాటు అయ్యే BIS హాల్‌మార్క్, HUID నంబర్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. కేవలం తక్కువ ధరకు వస్తోందని గుర్తింపు లేని చోట్ల బంగారం కొనుగోలు చేయడం మంచిది కాదు.

Loading...
Unable to load recommendations.
Follow Us