సూపర్‌ గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేని రుణాలు! ఏ బ్యాంక్‌లో ఎవరికి ఇస్తున్నారంటే?

IDFC ఫస్ట్ బ్యాంక్, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌ల కోసం 'బిజినెస్ మల్టిప్లయర్ మెటల్ క్రెడిట్ కార్డ్'ను ప్రవేశపెట్టింది. FD-ఆధారితమైన ఈ కార్డు, వ్యాపార ఆర్థిక నిర్వహణను సులభతరం చేస్తుంది. కార్డ్‌పై వ్యాపార పేరు ముద్రణ, 0 శాతం ఫారెక్స్ మార్కప్, 45 రోజుల వడ్డీ లేని క్రెడిట్, రివార్డ్ పాయింట్లు వంటి ప్రయోజనాలున్నాయి.

సూపర్‌ గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేని రుణాలు! ఏ బ్యాంక్‌లో ఎవరికి ఇస్తున్నారంటే?
Loan

Updated on: May 16, 2026 | 8:00 AM

చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి వృత్తిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ కొత్తగా బిజినెస్ మల్టిప్లయర్ మెటల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆధారంగా పనిచేసే ఈ ప్రీమియం మెటల్ కార్డ్‌ను ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపారాలకు ఆర్థిక నిర్వహణ సులభం చేయడానికి రూపొందించినట్లు బ్యాంక్ తెలిపింది. చాలా మంది వ్యాపార యజమానులు ఇప్పటికీ వ్యక్తిగత కార్డులతోనే వ్యాపార ఖర్చులు నిర్వహిస్తుండటంతో, వ్యక్తిగత, వ్యాపార లావాదేవీల మధ్య గందరగోళం ఏర్పడుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు కొత్త కార్డులో కార్డుదారుడి పేరుతో పాటు వ్యాపార పేరును కూడా ముద్రించే సదుపాయం కల్పించారు.

దీనివల్ల వ్యాపార గుర్తింపు మరింత ప్రొఫెషనల్‌గా కనిపించడంతో పాటు ఖర్చుల ట్రాకింగ్ కూడా సులభమవుతుంది. ఈ కార్డు ద్వారా ఆఫీస్ సామాగ్రి కొనుగోలు, డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులు, సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్‌లు, వ్యాపార ప్రయాణాలు, అంతర్జాతీయ చెల్లింపులు, ఉద్యోగుల ఖర్చులు వంటి వ్యాపార అవసరాలను నిర్వహించవచ్చు. అలాగే 45 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ లావాదేవీలపై 0 శాతం ఫారెక్స్ మార్కప్ ఉండటం ఈ కార్డుకు మరో ప్రధాన ఆకర్షణ. విదేశీ చెల్లింపులు చేసే వ్యాపారాలకు ఇది అదనపు ప్రయోజనంగా మారనుంది. UPI చెల్లింపులు, వ్యాపార కేటగిరీల ఖర్చులపై ప్రత్యేక రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి.

ఈ క్రెడిట్ కార్డును పొందడానికి కనీసం రూ.50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ అవసరం. FD విలువలో 100 శాతం వరకు క్రెడిట్ పరిమితి ఇస్తామని బ్యాంక్ తెలిపింది. కార్డు జాయినింగ్, వార్షిక రుసుము రూ.1,000 కాగా, ఏడాదిలో రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తే ఈ ఫీజును మాఫీ చేస్తారు. వ్యాపారవేత్తలకు మెరుగైన చెల్లింపు అనుభవం, సౌకర్యవంతమైన నగదు ప్రవాహ నిర్వహణ, బలమైన క్రెడిట్ మద్దతు అందించడమే ఈ కార్డు లక్ష్యమని బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us