
ఒక చెంపమీద కొడితే రెండు చెంపలు వాయించే కాలమిది. అందుకే మన చుట్టూ శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో దేనికైనా రెడీ అనేలా రక్షణ రంగాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తోంది కేంద్రం. ఎలాంటి ఉపధ్రవం ఎదురైనా.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా డిఫెన్స్ బడ్జెట్‌ను మరో రూ.50 వేల కోట్లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పెంచే బడ్జెట్‌ను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయి. ఈ 7 లక్షల కోట్ల బడ్జెట్ మొత్తాన్ని రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆయుధాల కొనుగోళ్లు, ఇతర అవసరమైన వస్తువుల కొనుగోలుకు వాడనున్నారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణ శాఖపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఏకంగా రూ. 2.29 లక్షల కోట్లను కేటాయించారు. 2025. 2026 సంవత్సరానికి కేంద్రం రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లను కేటాయించింది. గత సంవత్సరం కంటే ఇది చాలా ఎక్కువ. 2024..2025 సంవత్సరానికి కేంద్రం 6.22 కోట్లను కేటాయించింది. 2025..2026 సంవత్సరానికి ఆ నిధుల్ని 9.2 శాతం పెంచేసింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, గత 10 సంవత్సరాలలో రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి