
Raymond Vijaypat Singhania: భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్లలో ఒకటైన ‘రేమండ్’ (Raymond) గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన పారిశ్రామిక దిగ్గజం విజయపత్ సింఘానియా (87) ముంబైలో కన్నుమూశారు. విజయపత్ సింఘానియా కుమారుడు, గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన గౌతమ్ సింఘానియా ఆయన మరణ వార్తను ఇన్‌స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు. సింఘానియా ముంబైలో మరణించారని, ఆయన అంత్యక్రియలు ముంబైలోని చందన్‌వాడి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు.
పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన విజయపత్ సింఘానియా, ఒక నిష్ణాతుడైన పైలట్ కూడా, హాట్ ఎయిర్ బెలూన్‌లో అత్యధిక ఎత్తుకు చేరుకున్నందుకు ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు. ఆయన 2000 సంవత్సరం వరకు రెండు దశాబ్దాల పాటు రేమండ్ సంస్థకు ఛైర్మన్‌గా పనిచేశారు.
రేమండ్ ప్రస్థానం 1925లో ఒక సాధారణ టెక్స్‌టైల్ మిల్‌గా ప్రారంభమైంది. అప్పట్లో ఈ మిల్లులో ప్రధానంగా భారత సైన్యం కోసం ఉన్ని దుస్తులను (Army Uniforms) తయారు చేసేవారు. 1980లో విజయపత్ సింఘానియా కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేమండ్ రూపురేఖలే మారిపోయాయి. ఒక సాధారణ వస్త్ర వ్యాపారాన్ని ఆధునిక పారిశ్రామిక గ్రూప్‌గా ఆయన తీర్చిదిద్దారు.
సాధారణ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ దుస్తులు, ప్రీమియం సూటింగ్-షర్టింగ్ విభాగాల్లోకి రేమండ్‌ను విజయపత్ ప్రవేశపెట్టారు. 1958లో ముంబైలో రేమండ్ తన తొలి రిటైల్ షోరూమ్‌ను ప్రారంభించింది. “The Complete Man” అనే ప్రకటనల ప్రచారం ద్వారా రేమండ్ బ్రాండ్ దేశంలోని ప్రతి ఇంటికి చేరువైంది. అప్పట్లో మార్కెటింగ్ సంచలనం సృష్టించింది.
నేడు రేమండ్ గ్రూప్ కేవలం వస్త్ర రంగానికే పరిమితం కాలేదు. విజయపత్ సింఘానియా దార్శనికతతో ఇది బహుముఖంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా 600 నగరాల్లో 500 కంటే ఎక్కువ షోరూమ్‌లు విస్తరించి ఉన్నాయి. 20 వేలకు పైగా రంగులు, డిజైన్లలో వస్త్రాలను ఉత్పత్తి చేస్తోంది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, FMCG రంగాలలో కూడా రేమండ్ తన ముద్ర వేసింది. ఈ గ్రూప్‌లో సుమారు 6500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద ‘వర్స్టెడ్ ఫ్యాబ్రిక్’ తయారీదారుగా రేమండ్ గుర్తింపు పొందింది.
RIP. Om Shanti 🙏 pic.twitter.com/nGtOGAEtHt
— Gautam Singhania (@SinghaniaGautam) March 28, 2026
విజయపత్ సింఘానియా జీవితంలో వ్యాపార విజయాలతో పాటు కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు, తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు మధ్య ఆస్తి విషయంలో తలెత్తిన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వ్యాపారవేత్తగానే కాకుండా, విజయపత్ సింఘానియాకు ఏవియేషన్ (విమానయానం) అంటే ప్రాణం. ఆయన రికార్డు స్థాయి పైలట్‌గా కూడా గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
సైనికుల యూనిఫామ్స్ కుట్టే స్థాయి నుంచి ప్రపంచ స్థాయి ఫ్యాషన్, లైఫ్ స్టైల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన విజయపత్ సింఘానియా చరిత్ర ప్రతి వ్యాపారవేత్తకు స్ఫూర్తిదాయకం. ఆయన మరణం భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటు.
విజయపత్ సింఘానియా రేమండ్ గ్రూప్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధానికి ప్రసిద్ధి చెందారు. అక్కడ ఆయన 1980 నుండి 2000 వరకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన నాయకత్వంలో ఆ సంస్థ భారతదేశంలోని ప్రముఖ వస్త్ర, దుస్తుల బ్రాండ్‌లలో ఒకటిగా ఎదిగింది. వ్యాపారంతో పాటు, సింఘానియా విమానయాన రంగంలో సాధించిన విజయాలకు కూడా ప్రసిద్ధి చెందారు.
2005లో ఆయన హాట్ ఎయిర్ బెలూన్‌లో 21,000 మీటర్లకు పైగా ఎత్తుకు చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ ఘనత ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆయన ఒక అంతర్జాతీయ ఎయిర్ రేసులో కూడా గెలుపొందారు. అలాగే భారతదేశంలో విమానయాన క్రీడలను చురుకుగా ప్రోత్సహిస్తున్నారు.
విమానయాన రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, 1994లో భారత వైమానిక దళంలో ఆయనకు గౌరవ ఎయిర్ కమోడోర్ హోదాను ప్రదానం చేశారు. పరిశ్రమ, సాహస క్రీడలకు ఆయన చేసిన సేవలకు గాను పద్మభూషణ్‌తో సహా అనేక పురస్కారాలను కూడా అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Natural Perfume: ఖరీదైన పర్ఫ్యూమ్‌లు మర్చిపోండి! ఈ 3 పూలతోనే ఇంట్లోనే మీ ‘సిగ్నేచర్’ సువాసన తయారు!
ఇది కూడా చదవండి: Ola Offer: పెట్రోల్ కష్టాలకు చెక్.. కేవలం రూ.49,999కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. మార్చి 31 వరకు అదిరిపోయే ఆఫర్లు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి