Maternity Insurance: మెటర్నిటీ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ చేసుకోండి.. పూర్తి వివరాలు..
Maternity Insurance: పెళ్లి చేసుకోగానే మెటర్నిటీ ఇన్సూరెన్స్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిని ఎలా ఇదిగమించాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Maternity Insurance: వచ్చే నెలలో రాణీ తల్లి కాబోతోంది. ప్రసవానికి అయ్యే ఖర్చు గురించి తెలుసుకునేందుకు భర్తతో కలిసి హాస్పిటల్ కి వెళ్లింది. సాధారణ ప్రసవానికి 60 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని హాస్పిటల్ లో అంచనా చెప్పారు. అదే సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాల్సిన పరిస్థితి వస్తే లక్ష రూపాయల వరకు అవసరమని లెక్క చెప్పారు హాస్పిటల్ లో. రాణీ భర్త దీనికోసం ఎటువంటి సేవింగ్స్ చేయలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చిన వారు ప్రసవానికి అయ్యే ఖర్చుల గురించి టెన్షన్ పడుతున్నారు. వారు ఇప్పటికే మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవర్‌ను తీసుకుని ఉన్నట్లయితే ఈ ఆసుపత్రి ఖర్చుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎవరికైనా ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే వివాహం తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ కవర్‌ను చేర్చడం మంచి ఆప్షన్. దీనివల్ల దంపతులకు మనీ టెన్షన్ లేకుండా తల్లితండ్రులయిన ఆనందం పెరుగుతుంది. అసలు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చదవండి..
ఇవీ చదవండి..
Big Bazaar Cheating: ఆఫర్ల పేరుతో ‘బిగ్’ చీటింగ్.. మ్యాటర్ తెలిసి బోరుమంటున్న బాధితులు..!