Phonepe: వారెవ్వా.. ఫోన్‌పేలో రూ.5 లక్షల వరకు లోన్.. సింపుల్‌గా ఇలా చేస్తే నిమిషాల్లోనే డబ్బు అకౌంట్లో జమ..

జేబులో చిల్లి గవ్వ లేదు.. అత్యవసరంగా డబ్బు కావాలి.. బ్యాంకుకు వెళ్తే డాక్యుమెంట్లు, షూరిటీలు అంటూ తిప్పుతున్నారు.. ఇలాంటి టెన్షన్‌లో ఉన్నారా..? అయితే మీకు శుభవార్త. మనం రోజూ వాడే ఫోన్‌పే ఇప్పుడు మీకు అండగా నిలుస్తోంది. ఎలాంటి తాకట్టు లేకుండా కేవలం మీ మొబైల్ నుంచే రూ.5 లక్షల వరకు లోన్ పొందే అద్భుతమైన అవకాశం ఉంది. ఎలా అంటే..?

Phonepe: వారెవ్వా.. ఫోన్‌పేలో రూ.5 లక్షల వరకు లోన్.. సింపుల్‌గా ఇలా చేస్తే నిమిషాల్లోనే డబ్బు అకౌంట్లో జమ..
How To Apply For Phonepe Personal Loan

Updated on: Jan 22, 2026 | 1:18 PM

ప్రస్తుతం మనకు ఏ అవసరం వచ్చినా టక్కున గుర్తొచ్చేది లోన్. గతంలో మాదిరి లోన్ కావాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు. నిమిషాల్లో డబ్బు అకౌంట్‌లోకి వస్తుంది. డిజిటల్ చెల్లింపుల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌పే ఇప్పుడు సామాన్యులకు లోన్స్ ఇవ్వడంలోనూ ముందుంటుంది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వివిధ బ్యాంకులు, NBFCలతో జతకట్టి తక్షణ లోన్స్ అందిస్తోంది. మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి రూ. 10,000 నుండి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు పొందవచ్చు. ఇవి అన్‌సెక్యూర్డ్ రుణాలు, కాబట్టి ఎలాంటి ఆస్తి లేదా బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పనిలేదు.

72 గంటల్లోనే..

మీ దరఖాస్తు ఆమోదం పొందిన 72 గంటల్లోపు డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి 12 నెలల నుండి 60 నెలల వరకు గడువును ఎంచుకోవచ్చు. ఏటా 11.30శాతం నుండి 35శాతం వరకు ఉంటాయి. 21 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయం కనీసం రూ.15,000 ఉండాలి. సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువగా ఉంటే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్

ఈ ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ సిద్ధంగా ఉంటే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:

  • ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి Loans విభాగంలోకి వెళ్లండి.
  • మీ వ్యక్తిగత వివరాలు అందించి అర్హతను చెక్ చేసుకోండి.
  • లోన్ మొత్తం, కాలపరిమితిని ఎంచుకుని అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

ఫోన్‌పేలో ప్రాసెసింగ్ ఫీజు, EMI వివరాలు అన్నీ ముందే స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు. సకాలంలో ఈఎంఐలు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరిగి, భవిష్యత్తులో మరిన్ని పెద్ద లోన్స్ సులభంగా పొందే అవకాశం ఉంటుంది. అత్యవసర వైద్య ఖర్చులు లేదా చిన్న వ్యాపార అవసరాలకు ఇది ఒక సురక్షితమైన మార్గం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి