E-Pan Card: 10 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు..! ఎలా దరఖాస్తు చేయాలంటే..
ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి అయింది. బ్యాంకు ఖాతా దగ్గర నుంచి ఐటీ రిటర్నుల ఫైల్లింగ్ చేసే వరకు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే....
ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి అయింది. బ్యాంకు ఖాతా దగ్గర నుంచి ఐటీ రిటర్నుల ఫైల్లింగ్ చేసే వరకు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే.. అయితే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయితే ఈ నిరీక్షణ లేకుండా ఈ-పాన్ కార్డు పొందవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది. అయితే ఆధార్ నెంబరుకు మీ మొబైల్ నెంబరు అనుసంధానించి ఉండాలి లేకుంటే ఈ పాన్ పొందలేరు.