PAN Card: మీ పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివ్‌ చేసుకోండిలా!

|

Mar 15, 2025 | 4:35 PM

PAN Card: ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎడమ వైపు క్విక్ లింక్‌ల విభాగంలో Verify PAN status అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ పాన్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనసాగించుపై..

PAN Card: మీ పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివ్‌ చేసుకోండిలా!
Follow us on

పాన్‌ కార్డు ఈ రోజుల్లో తప్పనిసరిగా మారింది. బ్యాంకు అకౌంట్‌ తీయడం నుంచి లావాదేవీలు చేసే వరకు పాన్‌ కార్డు కావాల్సిందే. ఒకప్పుడు పాన్‌ కార్డు లేకున్నా బ్యాంకు అకౌంట్‌ తీసేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పాన్‌ లేనిది ఎలాంటి అకౌంట్‌ తీయలేరు. ఈ రోజుల్లో బ్యాంకు లావాదేవీలు, అకౌంట్‌ తీయడం, రకరకాల లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి. పాన్‌ కార్డు వల్ల వ్యక్తి ఆర్థికపరమైన విషయాలను సులభంగా తెలిసిపోతాయి.

ఇది కూడా చదవండి: Reliance Jio: ఇది కదా కావాల్సింది.. జియోలో 5 చౌకైన డేటా ప్లాన్స్‌ గురించి మీకు తెలుసా..?

అయితే పాన్ కార్డ్ డీయాక్టివేట్‌ అయితే మీ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాన్‌ కార్డు పని చేయకుంటే మీకు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడం, అనేక ఇతర ఆర్థిక పనులు చేయడం కష్టంగా మారవచ్చు. మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ చేయబడటానికి లేదా క్లోజ్‌ చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మరి పాన్‌ కార్డు పని చేయకుంటే ఎలా గుర్తించాలి? పాన్‌ని మళ్లీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం.

PAN కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఎందుకు మారుతుంది?

  • పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయని సమయంలో డీయాక్టివేట్‌గా మారవచ్చు.
  • ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే..
  • నకిలీ పాన్ కార్డు ఉండటం

ఇన్‌యాక్టివ్ పాన్ కార్డ్‌ని గుర్తించండిలా:

ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎడమ వైపు క్విక్ లింక్‌ల విభాగంలో Verify PAN status అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ పాన్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనసాగించుపై క్లిక్ చేశాక మీ ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. దీని తర్వాత కన్ఫర్మ్‌పై క్లిక్ చేసి, ఆపై మీరు PAN యాక్టివ్‌గా ఉందో లేదో తెలుస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు మీరు స్క్రీన్‌పై PAN యాక్టివ్‌గా ఉందని చూపిస్తుంది. అయితే, ఇన్‌యాక్టివ్‌లో స్క్రీన్‌పై కనిపించే సందేశంలో ఇన్‌యాక్టివ్ అని రాసి ఉంటుంది.

ఇన్‌యాక్టివ్ పాన్ కార్డ్‌ని యాక్టివేట్ చేయడం ఎలా?

మీ పాన్‌ కార్డు ఇన్‌యాక్టివ్‌గా మారినట్లయితే యాక్టివ్‌ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసెస్సింగ్ ఆఫీసర్ (AO)కి లేఖ రాయండి. ఆదాయపు పన్ను శాఖకు అనుకూలంగా నష్టపరిహారం బాండ్‌ను పూరించండి. గత 3 సంవత్సరాలుగా డియాక్టివేటెడ్ పాన్‌ను ఉపయోగించి దాఖలు చేసిన ITRని కూడా సమర్పించండి. ప్రాంతీయ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో సంబంధిత పత్రాలను సమర్పించండి. పాన్ కార్డ్ మళ్లీ యాక్టివేట్ కావడానికి దాదాపు 15 రోజులు పడుతుంది.

ఇది కూడా చదవండి: Credit Card: ఈ ఐదుగురు పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు.. అప్పులే కాదు సిబిల్‌ స్కోర్‌ గోవిందా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి