
Gold Jewellery: భారతీయ కుటుంబాల్లో బంగారు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ. కొందరి ఇళ్లలో తరతరాలుగా వచ్చిన బంగారు ఆభరణాలు కూడా ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఎంత బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తారు? ఐటీ దాడులు జరిగితే బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
తాజాగా హైదరాబాద్ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఇచ్చిన తీర్పు ఈ అంశంపై మరోసారి చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీల సమయంలో 807.5 గ్రాముల బంగారు ఆభరణాలు లభించగా, వాటి విలువ రూ.16.01 లక్షలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు లెక్కల్లో చూపని పెట్టుబడిగా పరిగణించారు. అయితే కుటుంబ సభ్యులకు చెందిన ఆభరణాలుగా సమర్పించిన వివరణను ట్రిబ్యునల్ అంగీకరించి ఆ మొత్తాన్ని తొలగించాలని ఆదేశించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) 1994లో జారీ చేసిన Instruction No.1916 ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ తనిఖీల సమయంలో సాధారణంగా స్వాధీనం చేసుకోకుండా మినహాయించే బంగారు ఆభరణాల పరిమాణాలు ఇలా ఉన్నాయి.
ఇవి ఆదాయపు పన్ను తనిఖీల సమయంలో సాధారణంగా బంగారం స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు సూచించిన పరిమాణాలు మాత్రమే.
చాలామంది 500 గ్రాములు, 250 గ్రాములు, 100 గ్రాములనే ఇంట్లో ఉంచుకోగల గరిష్ఠ పరిమితులుగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇవి బంగారం కలిగి ఉండటంపై విధించిన చట్టపరమైన పరిమితులు కావు. ఒక వ్యక్తి లేదా కుటుంబం ఈ పరిమాణాల కంటే ఎక్కువ బంగారం కలిగి ఉన్నంత మాత్రాన అది అక్రమంగా సంపాదించినదని భావించలేరు. అయితే ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంపాదించారు? వారసత్వంగా వచ్చిందా? పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బహుమతిగా వచ్చిందా? కొనుగోలు చేశారా? వంటి వివరాలను అవసరమైనప్పుడు వివరించగలగాలి.
అవును. ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం ఉన్నప్పుడు దాని మూలాన్ని వివరించడానికి వీలైన ఆధారాలు దగ్గర ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ పత్రాలు ఉపయోగపడతాయి.
ఈ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 2010 నవంబర్ 25న ఓ వ్యక్తి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మొత్తం 1,054.5 గ్రాముల స్థూల బరువున్న బంగారు ఆభరణాలు లభించాయి. వాటి నికర బరువు 807.5 గ్రాములుగా నిర్ధారించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన వాల్యూయర్ వాటి విలువను రూ.16,01,975గా అంచనా వేశారు.
ఆ ఆభరణాలు తన భార్య, కుమార్తె, కుమారుడు సహా కుటుంబ సభ్యులకు చెందినవని, వివిధ సందర్భాల్లో బహుమతులుగా వచ్చాయని బాధితుడు వివరించారు. CBDT మార్గదర్శకాల ప్రకారం కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు.
అయితే తొలుత ఆదాయపు పన్ను అధికారి ఈ వివరణను అంగీకరించలేదు. దీంతో రూ.16.01 లక్షలను లెక్కల్లో చూపని పెట్టుబడిగా పరిగణించారు. ఈ వ్యవహారం ITAT హైదరాబాద్ బెంచ్‌కు చేరగా, కుటుంబ సభ్యుల యాజమాన్యం, బంగారం పరిమాణం, CBDT మార్గదర్శకాలను పరిశీలించిన ట్రిబ్యునల్ ఆ మొత్తంపై చేసిన అదనపు పన్ను అంచనాను తొలగించాలని ఆదేశించింది.