
ప్రస్తతం భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పని సరి.. ప్రభుత్వం అందించే పథాలు పొందాలన్నా, బ్యాంక్ కాతా కవాలన్నా, కొత్త సిమ్ కొనాలన్నా.. ఇలా దీనికైనా ఆధార్ కావాల్సిందే. అలాగే మీ ఆధార్‌కు మీ మొబైల్ నెంబర్ లింక్ చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి దానికి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మీరు ఈసేవలను పొందాలి అంటే మీ ఆధార్‌కు లింకై ఉన్న నెంబర్‌ను ఎప్పికప్పుడూ అప్‌డేట్ చేసుకోవాలి. అయితే చాలా మందికి మనం ఆధార్‌లో మొబైల్ నెంబర్‌ను ఎన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఆధార్‌లో ఎన్ని సార్లు మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలో చూద్దాం.
ఎక్కువ మంది చదివినవి: కొంప ముంచావ్ కదరా చిట్టి.. బాలుడిని కడుపులో తన్నేసిన రోబో.. ఇదిగో వీడియో
ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొన్ని స్పష్టమైన నియమాలను అందించింది. UIDAI ప్రకారం.. మీరు మీ ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. మీరు టెలికాం ఆపరేటర్‌ను మార్చినా, కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నా లేదా పాత నంబర్ పోయినా.. ఎన్నిసార్లైనా కొత్త నంబర్‌ను మీ ఆధార్‌కు లింక్ చేసుకోవచ్చు. అంతే కాదు ఆధార్‌లో మీరు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి ఎటువంటి అదనపు పత్రాలు లేదా పాత మొబైల్ బిల్లులు సమర్పించాల్సిన అవసరం లేదు.ఈ ప్రక్రియ పూర్తిగా మీ బయోమెట్రిక్ నిర్ధారణపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు ఈజీగా మీ మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.
మొబైల్ నంబర్‌ను ఎలా మార్చుకోవాలి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.