MG Windsor EV: మూడు వేరియంట్లతో మామూలుగా లేదుగా ‘విండ్సర్’.. ఎంజీ కొత్త ఈవీ ఇదే..

|

Sep 15, 2024 | 4:26 PM

ప్రఖ్యాత ఎంజీ మోటార్స్ ఇండియా నుంచి కొత్త ఎంజీ విండర్స్ ఎలక్ట్రిక్ కార్ విడుదలైంది. ఆధునిక టెక్నాలజీతో, అన్ని ఫీచర్లతో, ఆకట్టుకునే లుక్ తో దీన్ని విడుదల చేశారు. ఈ కంపెనీ నుంచి గతంలో జెడ్ ఎస్, కామెట్ అనే పేర్లతో ఈవీలు విడుదలయ్యాయి. ఇప్పుడు మూడో కారును ఆవిష్కరించారు. కొత్త కారు మూడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

MG Windsor EV: మూడు వేరియంట్లతో మామూలుగా లేదుగా ‘విండ్సర్’.. ఎంజీ కొత్త ఈవీ ఇదే..
Mg Windsor Ev
Follow us on

ఎలక్ట్రిక్ కార్లకు మన దేశంలో విపరీమైన ఆదరణ లభిస్తోంది. దానికి అనుగుణంగా ఈ మార్కెట్ కు అనేక కొత్త కార్లు పరిచయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఎంజీ మోటార్స్ ఇండియా నుంచి కొత్త ఎంజీ విండర్స్ ఎలక్ట్రిక్ కార్ విడుదలైంది. ఆధునిక టెక్నాలజీతో, అన్ని ఫీచర్లతో, ఆకట్టుకునే లుక్ తో దీన్ని విడుదల చేశారు. ఈ కంపెనీ నుంచి గతంలో జెడ్ ఎస్, కామెట్ అనే పేర్లతో ఈవీలు విడుదలయ్యాయి. ఇప్పుడు మూడో కారును ఆవిష్కరించారు. కొత్త కారు మూడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటి ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 3 నుంచి బుక్కింగ్‌లు..

ఎంజీ విండ్సర్ ఈవీ బుకింగ్‌లు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్‌లు సెప్టెంబర్ 25 నుంచి మొదలవుతాయి. బుక్కింగ్ చేసుకున్నవారికి అక్టోబర్ 12వ తేదీ నుంచి డెలివరీలు చేస్తారు. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది.

మూడు రకాల వేరియంట్లు..

విండ్సర్ ఈవీ మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే పేర్లతో లభిస్తాయి. ఈ మూడు వేరియంట్లు 136 హెచ్ పీ శక్తి, 200 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తాయి. ఇ-మోటార్ 38కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ ఆధారంగా రూపొందించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.

ఎంజీ విండ్సర్ ఎక్సైట్..

ఎంజీ విండ్సర్ ఎక్సైట్ వెర్షన్ రూ.9.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. దీన్ని ఎంట్రీ లెవల్ వేరియంట్ అని పిలుస్తారు. వీల్ కవర్‌లతో కూడిన 17 అంగుళాల స్టీల్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, గ్లాస్ యాంటెన్నా, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 60:40 వెనుక సీట్ స్ప్లిట్‌తో కూడిన ఫ్యాబ్రిక్ సీట్లు, ఎల్ఈడీ లగేజ్ ల్యాంప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ లు, టెయిల్ ల్యాంప్ లు, ఇల్యూమినేటెడ్ ఫ్రంట్ లోగో, వెనుక ఏసీ వెంట్స్, ఎల్ఈడీ ఫ్రంట్ రీడింగ్ లైట్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే/ఆండ్రాయిడ్ ఆటోతో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోళ్లు, 3.3 కేడబ్ల్యూ పోర్టబుల్ ఛార్జింగ్ కేజీ, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

ఎంజీ విండ్సర్ ఎక్స్‌క్లూజివ్..

దీనిలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎంజీ యాప్ స్టోర్, జియో ఫైబర్ ను ఉపయోగించుకునే హోమ్-టు-కార్, రియర్ వ్యూ మానిటర్, డిజిటల్ కీ, రిమోట్ కార్ లాక్/అన్‌లాక్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా అదనంగా వైఫై కనెక్టివిటీ, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్‌లు, క్రోమ్ విండో బెల్ట్‌లైన్, లెథెరెట్ స్టీరింగ్ వీల్, లెథెరెట్ డ్యాష్‌బోర్డ్, లీథెరెట్ సీట్లు, స్మార్ట్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పవర్ ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, కప్‌హోల్డర్‌తో వెనుక ఆర్మ్‌రెస్ట్, 360 డిగ్రీ కెమెరా, టీపీ ఆటో డిమ్మింగ్ ఐఆర్ వీఎం, వైర్‌లెస్ ఛార్జర్, బహుళ భాష వాయిస్ ఆదేశాలు, వాలెట్ మోడ్ ఆకట్టుకుంటున్నాయి. ఎంజీ విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ఈవీని మిడ్-స్పెక్ వేరియంట్ గా పిలుస్తారు. ఎక్సైట్‌లో ఉన్న అన్ని ఫీచర్లనూ దీనిలో ఏర్పాటు చేశారు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

ఎంజీ విండ్సర్ ఎసెన్స్..

ఎంజీ విండ్సర్ ఎసెన్స్ ఈవీలో పైన తెలిపిన రెండు వేరియంట్లలోని ఫీచర్లు ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా యాంబియంట్ లైటింగ్, పీఎం 2.5 ఫిల్టర్, ఇన్ఫినిటీ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, 7.4 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్, గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ అదనపు ఆకర్షణ. ఈ వేరియంట్ ధరను కూడా ఇంకా వెల్లడించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..