Girl Schemes: ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు ఇవే బెస్ట్ స్కీమ్స్.. సుకన్య సమృద్ధి కంటే టాప్ ఇవి..

|

May 12, 2024 | 4:22 PM

సాధారణంగా ఆడపిల్ల కోసం పథకం అనగానే అందరికీ గుర్తొచ్చేది సుకన్య సమృద్ధి యోజన. దీనిలో దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది కాబట్టి ఇది చాలా మంది ఆప్షన్. అయితే ఇది ఒక్కటీ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇతర పథకాలలో కూడా స్వల్ప మొత్తాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారి ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.

Girl Schemes: ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు ఇవే బెస్ట్ స్కీమ్స్.. సుకన్య సమృద్ధి కంటే టాప్ ఇవి..
మీరు వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనలో ఉన్న చిన్న టాలెంట్‌తో కూడా లక్షల్లో సంపాదించవచ్చు.
Follow us on

పొదుపు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. జీవితంలో ఏదైనా ఉన్నత స్థితికి చేరుకోవాలన్నా.. రిటైర్ మెంట్ తర్వాత సుఖమయ జీవితం గడపాలన్నా.. ముందు నుంచే పొదుపు అవసరం. అయితే కేవలం డబ్బు పొదుపు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. దానిని నుంచి వీలైనంత అధిక లాభాలు సమకూర్చాలంటే మంచి పెట్టుబడి పథకాలలో మనం ఇన్వెస్ట్ చేస్తుండాలి. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి. మీ కోసం అంటే మీ రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం ఏదైనా మంచి పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు, వారి ఉన్నత చదువుల కోసం దీర్ఘకాలిక పథకాలలో పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారు పుట్టినప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. సాధారణంగా ఆడపిల్ల కోసం పథకం అనగానే అందరికీ గుర్తొచ్చేది సుకన్య సమృద్ధి యోజన. దీనిలో దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది కాబట్టి ఇది చాలా మంది ఆప్షన్. అయితే ఇది ఒక్కటీ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇతర పథకాలలో కూడా స్వల్ప మొత్తాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారి ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడ పిల్లల భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న ఇతర పథకాల గురించి తెలుసుకుందాం..

బెస్ట్ సుకన్య సమృద్ధి యోజన..

ఆడపిల్లల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. దీనిలో దీర్ఘ కాలంలో మంచి రాబడులు వస్తాయి. అధిక వడ్డీ కూడా దీనిలో ఉంటుంది. 15 సంవత్సరాలు దీనిలో పెట్టుబడి పెడితే.. మీ బిడ్డ వయసు 21 ఏళ్లు నిండే సమయానికి పెద్ద మొత్తంలో చేతి వస్తుంది. ఇది వారి ఉన్నత చదువులతో పాటు పెళ్లిళ్ల అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ ఒక్క పథకంతో ఆగిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. అనేక బాలికా పథకాలు ఇంకా ఉన్నాయని, వాటిల్లో కూడా అవకాశం ఉన్నంత వరకూ పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

రిస్క్ ఉన్నా తప్పదు..

రోజురోజుకీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కొంచెం రిస్క్ ఉన్న కొన్ని పెట్టుబడులను ఆప్షన్ గా తీసుకోవాలని వివరిస్తున్నారు. అవి ఆడపిల్లల పూర్తి అవసరాలను తీర్చుతాయని చెబుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఈక్విటీ, డెట్ ఫండ్లు, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. ఇవి మీకు సంపద సృష్టిలో మంచి వైవిద్యాన్ని అందిస్తాయని చెబుతున్నారు. వీటి గురించి తెలుసుకుందాం..

  • లాంగ్ టర్మ్ లో అధిక రాబడిని అందిచేవి ఈక్విటీ లింక్డ్ ఇన్ స్ట్రుమెంట్లు. వాటిల్లో డైరెక్ట్ ఈక్విటీ, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, యులిప్స్ వంటి ఉంటాయి.
  • అదే సమయంలో డెట్ లింక్ ఇన్ స్ట్రుమెంట్లు రెగ్యులర్ ఆదాయాన్ని అందించడంలో సాయపడతాయి. వాటిల్లో బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు, కార్పొరేట్ ఎఫ్డీ, ఎన్సీడీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉంటాయి. ఈక్విటీ లింక్డ్, డెట్ లింక్డ్ ఇన్‌స్ట్రుమెంట్లలో తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడులు ప్రారంభించాలని సూచిస్తున్నారు.
  • ఇవే కాక మనందరికీ బంగారంతో చాలా సెంటిమెంట్ ఉంటుంది. అయితే దీనిని కూడా మంచి పెట్టుబడి ఆప్షన్ గా వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎన్నటికీ తరిగిపోదని.. దీర్ఘకాలంలో మంచి వృద్ధితో కూడిన ఆదాయాన్ని అందిస్తుందని చెబుతున్నారు.
  • అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు కూడా మంచి ఆప్షనే అని.. ఇది రోజురోజుకూ అధిక ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..