Income Tax: ఈ బడ్జెట్‌లో ట్యాక్స్‌ చెల్లింపుదారులకు ఉపశమనం లభించనుందా? పన్ను స్లాబ్‌ పెంచనుందా?

|

Jan 29, 2024 | 6:59 PM

అత్యధిక ఆదాయపు పన్ను రేటు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్‌ను ప్రభుత్వం ప్రస్తుత రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచవచ్చని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం, అత్యధిక పన్ను శ్లాబుపై ప్రభుత్వం గరిష్టంగా 30 శాతం పన్నును విధిస్తుంది. ప్రత్యామ్నాయంగా, థ్రెషోల్డ్ రేటును 25 శాతానికి తగ్గించవచ్చు. ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులు పన్నులపై మరింత ఆదా చేసేందుకు వీలు..

Income Tax: ఈ బడ్జెట్‌లో ట్యాక్స్‌ చెల్లింపుదారులకు ఉపశమనం లభించనుందా? పన్ను స్లాబ్‌ పెంచనుందా?
Budget Tax
Follow us on

మధ్యంతర బడ్జెట్ రాబోతోంది. కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు గత బడ్జెట్‌లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. అయినప్పటికీ, దేశంలోని 60 శాతం పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ పాత పన్ను విధానాన్ని ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ప్రాచుర్యం పొందాలంటే, ఈ వ్యవస్థలో అనేక మెరుగుదలలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం వ్యక్తిగత పన్ను రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

అత్యధిక ఆదాయపు పన్ను రేటు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్‌ను ప్రభుత్వం ప్రస్తుత రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచవచ్చని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం, అత్యధిక పన్ను శ్లాబుపై ప్రభుత్వం గరిష్టంగా 30 శాతం పన్నును విధిస్తుంది. ప్రత్యామ్నాయంగా, థ్రెషోల్డ్ రేటును 25 శాతానికి తగ్గించవచ్చు. ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులు పన్నులపై మరింత ఆదా చేసేందుకు వీలు కల్పిస్తాయి. ఇది పాత విధానాన్ని వదిలిపెట్టి కొత్త పన్ను విధానాన్ని అనుసరించేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహిస్తుంది.

ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష ఆదా చేయండి:

పరిమితిని సంవత్సరానికి రూ.25 లక్షలకు పెంచినట్లయితే, సంవత్సరానికి రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారుడు ప్రతి సంవత్సరం రూ.1.04 లక్షలు ఆదా చేయవచ్చు. 25 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.98,800 ఆదా చేసుకోవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి.

మీకు ఉపశమనం ఎలా లభిస్తుంది?

బడ్జెట్‌లో పన్ను రేటు పరిమితిని రూ.20 లక్షలకు పెంచితే, ఏడాదికి రూ.25 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులు రూ.52,000 ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా, సంవత్సరానికి రూ. 20 లక్షలు సంపాదించే పన్ను చెల్లింపుదారుడు ప్రతి సంవత్సరం అదనంగా రూ.46,800 ఆదా చేస్తాడు. అయితే, ఇది ప్రతి సంవత్సరం రూ. 10 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్న వారిపై ప్రభావం చూపదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..