పన్ను చెల్లింపుదారులకు శుభవార్త..ఐటీ రిటర్నులకు గడువు పెంపు

|

Jun 25, 2020 | 2:09 PM

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు మోదీ ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త..ఐటీ రిటర్నులకు గడువు పెంపు
Follow us on

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు మోదీ ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2018–19, 2019–20 ఫైనాన్షియల్​ ఇయర్స్ కు సంబంధించి డెడ్​లైన్​ ను జులై 31 వరకు పెంచింది. ఈ మేరకు సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్ట్​ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ప్రెస్​నోట్​ రిలీజ్ ​చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది.

2018–19 ఏడాదికి గాను రివైజ్డ్​ రిటర్న్స్ ఫైల్​ చేయడానికి డెడ్​లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా.. దాన్ని జులై 31 కి పెంచిన కేంద్రం మరోవైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింకు చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఇది వరకు ప్రకటించిన డెడ్‌లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా, కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి 31లో ఈ రెండు కార్డులను లింక్ చేసుకోవాలని, లేకపోత రూ. 10వేల జరిమానా పడుతుందని ప్రభుత్వం తెలిపింది.