Gold Silver Price Today: దేశంలో నిలకడగా బంగారం ధరలు.. పెరిగిన వెండి.. అక్కడ మాత్రం భారీగా..

|

Apr 12, 2022 | 6:25 AM

Gold Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం..

Gold Silver Price Today: దేశంలో నిలకడగా బంగారం ధరలు.. పెరిగిన వెండి.. అక్కడ మాత్రం భారీగా..
Follow us on

Gold Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. తర్వాత తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (April 12)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,960 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధరల్లో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయంగా వెండి ధరలు పెరుగగా, కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది. ముంబైలో కిలో వెండిపై ఏకంగా రూ.3,800 తగ్గింది. అలాగే చెన్నైలో మాత్రం కిలో వెండిపై రూ.5,300 పెరిగింది. ఇలా కొన్ని ప్రాంతాల్లో భారీగా తగ్గుముఖం పట్టగా, కొన్ని ప్రాంతాల్లో భారీగానే పెరిగిందని చెప్పాలి. ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, విజయవాడలో రూ.72,300 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.72,300 ఉండగా, ముంబైలో రూ.67,700 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.67,700 ఉండగా, కోల్‌కతాలో రూ.67,700 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.72,300 ఉండగా, కేరళలో రూ.72,300 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. 23 శాతం పెరిగిన వంట నూనె ధరలు

Nominee Name: బ్యాంకు అకౌంట్‌, పీఎఫ్‌, ఇతర పథకాలలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?