
Gold Price Today: రోజు బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి మార్కెట్ ఒక శుభవార్తను అందించింది. ఈ రెండింటి ధరలలో పెద్దగా కదలిక లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లు, పండుగల కారణంగా బంగారం, వెండికి డిమాండ్ కూడా పెరుగుతుంది. అందువల్ల రోజువారీ ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా జూన్ 3వ తేదీన బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మీ నగరంలో బంగారం, వెండి ప్రస్తుత ధరను తెలుసుకుందాం. నగరాల వారీగా ధరలు ఇక్కడ ఉన్నాయి.
ఇదిలా ఉండగా, 2026, జూన్ 1న బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1.56 లక్షల వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1.43 లక్షల వద్ద ట్రేడ్ అయ్యాయి. వెండి ధరలు కిలోకు రూ.2.63 లక్షల నుంచి రూ.2.80 లక్షల మధ్య ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ ఒత్తిళ్లు, బలపడుతున్న డాలర్ దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
ఇది కూడా చదవండి: Jio Plan: 15 OTTలు, 1,000 ఛానెళ్లు, 30GB డేటాను కేవలం రూ.200కే..!
బంగారం, వెండి ధరలు నిలకడగా, పెరగడానికి ప్రధాన కారణాలు ప్రపంచ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, మార్కెట్ హెచ్చుతగ్గులు. అదే సమయంలో వెండికి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ దాని ధరలను కొత్త శిఖరాలకు చేరవేస్తోంది. భారతదేశంలో పెరిగిన దిగుమతి పన్నుల ప్రభావం కూడా ధరలపై కనిపిస్తోంది. ఈ కారణంగానే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ఖరీదైనవిగా ఉంటున్నాయి.
ఇది కూడా చదవండి: Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి